Manisha Ropeta : పాక్ లో పోలీస్ బాస్ గా హిందూ మ‌హిళ

బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌నీషా రోపేటా

Manisha Ropeta : ఎవ‌రీ మ‌నీషా రోపేటా అనుకుంటున్నారా. క‌రుడుగ‌ట్టిన సంప్ర‌దాయ దేశంగా, ఉగ్ర‌వాదుల‌కు అడ్డ‌గా పేరొందిన , పురుషాధిక్య స‌మాజానికి ప్ర‌తీక‌గా నిలిచిన పాకిస్తాన్ లో అత్యున్న‌త పోలీస్ ప‌ద‌విని ఒక భార‌తీయ మ‌హిళ స్వీక‌రించ‌డం మామూలు విష‌యం కాదు.

దీనిని సాధించింది మ‌నీషా రోపేటా(Manisha Ropeta). ఆమెకు ప‌ట్టుమ‌ని 26 ఏళ్లు మాత్ర‌మే. ప్ర‌స్తుతం సీనియ‌ర్ పోలీస్ బాస్ గా కొలువు తీరడం విశేషం. పోలీస్ ద‌ళం అంటేనే పురుషుల‌కు ఎంట్రీ ఇప్ప మ‌హిళ‌ల‌కు ఉండ‌దు ఆ దేశంలో.

కానీ కొంత మందికి మాత్రం గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో చాన్స్ ఇస్తుంది అక్క‌డి ప్ర‌భుత్వం. మొద‌టి హిందూ మ‌హిళ మ‌నీషా రోపేటా కావ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌నీషా రోపెటా పాకిస్తాన్ లోని సింధ్ పోలీస్ శాఖ‌లో అధికార హొదాలో ఉన్న కొద్ది మంది మ‌హిళా ఆఫీస‌ర్ల‌లో ఒక‌రుగా ఉన్నారు. పాకిస్తాన్ లోని మైనార్టీ హిందూ స‌మాజానికి చెందిన అతి త‌క్కువ వ‌య‌స్సు క‌లిగిన మ‌హిళ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌స్తుతం మ‌నీషా రోపేటా డిప్యూటీ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వ‌హిస్తోంది. ఈ సంద‌ర్భంగా మ‌నీషా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. చిన్న‌ప్ప‌టి నుండి నేను , నా సోద‌రీమ‌ణులు పితృస్వామ్య వ్య‌వ‌స్థ‌ను చూశాం.

పాకిస్తాన్ లో చ‌దువుకుని ఉద్యోగం చేయాలంటే అయితే టీచ‌ర్లు లేదంటే డాక్ట‌ర్లు మాత్ర‌మే కావాలి అని సింధ్ లోని జాకోబాబాద్ ప్రాంతానికి చెందిన రోపేటా చెప్పారు.

స‌మాజంలో ఎన్నో అవ‌మానాలు, క‌ష్టాలు ఎదుర్కొంటున్నారు మ‌హిళ‌లు. వారంద‌రికీ తాను ఎందుకు ర‌క్ష‌ణ‌గా ఉండ కూడ‌ద‌నే ఆలోచ‌న త‌న‌కు వ‌చ్చింద‌న్నారు.

అందుకే తాను పోలీస్ వృత్తిని ఎంచుకున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం శిక్ష‌ణ‌లో ఉన్న రోపేటా నేరాలు ఎక్కువ‌గా ఉన్న లియారీ ప్రాంతంలో నియ‌మించ‌నున్నారు.

Also Read : అత్యంత ఖ‌రీదైన భ‌వ‌నంలో సౌదీ ప్రిన్స్ బ‌స‌

Leave A Reply

Your Email Id will not be published!