Rohit Sharma : అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
సచిన్ టెండూల్కర్..రాహుల్ ద్రవిడ్..కోహ్లీ
Rohit Sharma : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. గాయం కారణంగా దూరమైన రోహిత్ విండీస్ జట్టుతో టి20 సీరీస్ ఆడేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యంలో యువ ఆటగాళ్లు దుమ్ము రేపారు.
వన్డే సీరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం భారత జట్టు శక్తివంతంగా మారింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటేందుకు రెడీగా ఉంది టీమిండియా.
రోహిత్ శర్మ రాహుల్ ద్రవిడ్ కోచింగ్ లో మరోసారి తన పర్ ఫార్మెన్స్ చేసేందుకు యత్నిస్తున్నాడు. అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు భారత జట్టు స్కిప్పర్.
ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో రోహిత్ శర్మ(Rohit Sharma) 16,000 వేల పరుగులు చేసేందుకు ఇంకా 108 పరుగుల దూరంలో ఉన్నాడు. టెస్టు, వన్డే, టి20 ఫార్మాట్ లలో ఎక్కువ రన్స్ చేసిన ఏడోవ భారతీయ క్రికెటర్ అవుతాడు.
ప్రస్తుతం భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు. అతడు 34,357 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ 24,208 రన్స్ తో , విరాట్ కోహ్లీ 23,726 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
బీసీసీఐ చీఫ్ గా ఉన్న సౌరవ్ గంగూలీ 18,575 పరుగులతో ఉండగా మహేంద్ర సింగ్ ధోనీ 17,266 రన్స్ తో, వీరేంద్ర సెహ్వాగ్ 17,253 పరుగులతో నిలిచారు. ఒకవేళ 108 రన్స్ గనుక చేస్తే రోహిత్ శర్మ(Rohit Sharma) సెహ్వాగ్ సరసన నిలుస్తాడు.
రోహిత్ శర్మ తరుచూ గాయాల కారణంగా మ్యాచ్ లు ఆడలేక పోతున్నాడు. ఒకవేళ కంటిన్యూ గా ఆడితే ఈ రికార్డు పూర్తయ్యేది.
Also Read : భారత మహిళా జట్టుకు తీపి కబురు