Sridharan Sriram : ఆస్ట్రేలియా కోచ్ కు శ్రీధరన్ శ్రీరామ్ గుడ్ బై
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఫోకస్
Sridharan Sriram : భారత క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ కోచ్ గా అవతారం ఎత్తిన శ్రీధరన్ శ్రీరామ్ ఉన్నట్టుండి ఆస్ట్రేలియా కోచ్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు. 2000 నుండి 2004 మధ్య కాలంలో శ్రీధరన్(Sridharan Sriram) ఆడాడు.
2015 నుండి ఆస్ట్రేలియా కోచింగ్ ఏర్పాటులో భాగంగా ఉన్నాడు. ఇక నుంచి ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఫోకస్ పెట్టనున్నాడు.
ఇదే విషయాన్ని మనోడు తెలిపాడు కూడా. ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ కోచ్ గా ఇంత కాలం చేపట్టాడు. ఇక ముగించడం తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నాడు శ్రీధరన్ శ్రీరామ్.
ఇక వచ్చే ఏడాది భారత్ లో ఆస్ట్రేలియా పర్యటన జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 2016లో అప్పటి ప్రధాన కోచ్ డారెన్ లీమాన్ ఆధ్వర్యంలో స్పిన్ బౌలింగ్ కోచ్ గా నియమించేకంటే ముందు భారత పర్యటనలో ఆస్ట్రేలియా – ఎ లో ఉన్నాడు.
గత ఆరేళ్లుగా ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా బాధ్యతలు నిర్వహించా. ఇవాళ వదిలి రావాలంటే చాలా బాధగా ఉందన్నాడు శ్రీధరన్ శ్రీరామ్.
బరువెక్కిన హృదయంతో నేను ఇక ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడాడు. సాధ్యమైనంత వరకు ఆ జట్టుకు పూర్తి సేవలు అందించినట్లు తెలిపాడు.
46 ఏళ్ల వయస్సు కలిగిన శ్రీధరన్ శ్రీరామ్ ఇక నుంచి ఆర్సీబీపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతే కాదు చెన్నైలోని తన ఇంట్లో ఎక్కువ సమయం గడపాలని ఎంచుకున్నాడు.
Also Read : అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ