Ratan Tata : ‘జే’ జ్హాపకం పదిలం రతన్ టాటా భావోద్వేగం
జహంగీర్ రతన్ జీ దాదా భాయ్ టాటాపై
Ratan Tata : భారతీయ వ్యాపారవేత్తలలో విస్మరించ లేని ఏకైక పదం రతన్ టాటా. వ్యాపారం అంటే సంపాదించడం కాదని, పది మందికి అన్నం పెట్టడమని, ఇతరుల కంపెనీలను మోసం చేయడం కాదని విలువలతో ఎదగాలని ఆయన నమ్ముతారు.
అలాగే ఉండాలని కోరుకుంటారు కూడా. ఇన్నేళ్లయినా టాటా కంపెనీలలో ఎలాంటి మార్పు లేదు. టెక్నాలజీ మారింది. తరాలు మారాయి. ఇంకా మారుతూనే ఉన్నాయి.
కానీ సంస్థకు సంబంధించిన మూలాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దటీజ్ రతన్ టాటాకు (Ratan Tata) ఉన్న గొప్పతనం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది.
తన కోసం పని చేసిన వారు. తన ఉన్నతికి తోడ్పడుతున్న వాళ్లు, తన సంస్థల్లో పని చేస్తున్న వారందరినీ తన కుటుంబంలోని వారిలాగానే ట్రీట్ చేస్తారు.
అది రతన్ టాటా గొప్పదనం. మాస్ లీడర్ గా పేరొందిన మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే తానే వెళ్లి టాటా ను కలుసుకున్నారు. ఆశీర్వాదం పొందారు.
గొప్ప వ్యక్తి ని కలుసు కోవడం వల్ల ఏం కోల్పోయామో తెలుస్తుందన్నారు షిండే. తాజాగా ఈ వ్యాపార దిగ్గజం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఎందుకంటే తాను అమితంగా ప్రేమించే జేఆర్డీ టాటాను తలుచుకుని. జేఆర్డీని ఆయన జే అని గౌరవంగా పిలుచుకుంటారు. 118వ జయంతి సందర్బంగా కంట తడి పెట్టుకున్నారు రతన్ టాటా.
జేఆర్డీ పూర్తి పేరు జహంగీర్ రతన్ జీ దాదా భాయ్ టాటా. తామిద్దరం కలిసి ఉన్న క్షణాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు రతన్ టాటా.
Also Read : గ్లోబల్ సింగర్ షకీరాకు బిగ్ షాక్