AP Comment : జగన్ వ్యూహం గెలుపే లక్ష్యం
ఇప్పటి నుంచే వ్యూహాత్మకం
AP Comment : సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఏపీ సీఎం సందింటి జగన్మోహన్ రెడ్డికి ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు.
ఒక్కసారి నమ్మితే ప్రాణం ఇచ్చే తన తాత రాజారెడ్డి వారసత్వం నుంచి వ్యక్తి. కనుక వ్యూహాలు పన్నడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
చిన్నతనం నుంచే చదువులో రాణించినా ఆయనకు పావులు కదపడాలు, టైం వేస్ట్ చేయడాలు అంటూ ఉండవు. ఏదైనా నేరుగా చేయాలని అనుకుంటారు.
తాను అనుకున్నాడంటే ఇక ఆ పని కావాల్సిందే. అందుకే జగన్ అంటే కొందరు అభిమానంతో జగమొండి అంటారు. వాటిని ఆయన నవ్వి ఊరుకుంటారు.
ప్రత్యర్థులకు సింహ స్వప్నంగా కనిపించినా కూల్ గా తన పని తాను చేసుకుంటూ పోవడంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ వచ్చారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఆయన వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
ఇక్కడే తన గేమ్ ప్లాన్ ను ఎవరూ అర్థం చేసుకోలేక పోయారు. ప్రజలతో ఎవరైతే కలిసి పోతారో వారినే జనం ఎక్కువగా నమ్ముతారు. దానినే వర్కవుట్ చేశాడు ఏపీ సీఎం(AP Comment).
ప్రస్తుతం ఆయనకు ఎక్కడా లేనంత బలం, బలగం ఉంది. చిటికేస్తే వాలిపోయే జనం ఉన్నారు. ప్రజా బలం గురించి చెప్పాల్సిన పని లేదు. జగన్ రెడ్డి మాటే శాసనం. చట్టం కూడా.
రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే తనను తాను మరింత బలోపేతం చేసుకుంటూ , తన వారిని మరింత కార్యోన్ముఖులు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
జగన్ రాకెట్ స్పీడ్ తో దూసుకు పోతోంటే ప్రత్యర్థులు మాత్రం విమర్శలకే పరిమితం కావడం విస్తు పోయేలా చేస్తోంది. లీడర్ ఎప్పుడూ ఒకరి కోసం చూడడు. తన కోసం ఎదురు చూసుకునేలా చేస్తాడు. అది జగన్ చేస్తున్నాడు.
Also Read : ఆరోపణలు సరే అరెస్ట్ లు ఎప్పుడు