Rohit Sharma : టీ20ల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్
అత్యధిక పరుగుల బ్యాటర్ గా నమోదు
Rohit Sharma : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టి20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
విండీస్ టూర్ లో భాగంగా జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో 44 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 2 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదే సమయంలో టి20 ఫార్మాట్ క్రికెట్ లో ఎక్కువ పరుగులు చేసిన లిస్టులో గతంలో టాప్ లో ఉన్న కీవీస్ కు చెందిన ఆటగాడు గఫ్టిల్ ను దాటేశాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) టాప్ లోకి చేరాడు.
విండీస్ తో చేసిన ఈ 64 పరుగుల సాయంతో మొత్తం తన కెరీర్ లో పొట్టి ఫార్మాట్ లో 3,443 పరుగులు పూర్తి చేశాడు.
ఇక మొత్తంగా పరుగుల జాబితాలో చూస్తే గుఫ్టిల్ 3,399 రన్స్ తో రెండో స్థానంలో నిలువగా మూడో ప్లేస్ లో భారత క్రికెట్ కు చెందిన మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ గా పేరొందిన విరాట్ కోహ్లి ఉన్నాడు. 3,308 పరుగులు చేశాడు.
ఇక ఐర్లాండ్ జట్టుకు చెందిన పాల్ స్టిర్లింగ్ 2,894 పరుగులతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్, ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న ఆరోన్ ఫించ్ 2, 855 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు.
ఇదిలా ఉండగా రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు సారథ్యం వహిస్తున్నాడు. గత రెండు సీజన్లలో ముంబై పేలవమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
ప్రస్తుతం భారత జట్టుకు నాయకుడిగా ఉన్నా అడపా దడపా గాయాల పాలవుతున్నాడు.
Also Read : అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ