ED Attached : కార్వే గ్రూప్ కేసులో రూ. 100 కోట్ల ఆస్తులు అటాచ్
ప్రకటించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
ED Attached : కార్వే గ్రూప్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోలుకోలేని షాక్ ఇచ్చింది.
మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి రూ. 110 కోట్ల ఆస్తులు అటాచ్ చేసినట్లు ఈడీ(ED Attached) ప్రకటించింది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
కార్వే గ్రూప్ దాదాపు రూ. 2,800 కోట్ల విలువైన తమ క్లయింట్ల షేర్లను అక్రమంగా తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు పొందిందని ఆరోపించింది.
ఇప్పటి వరకు ఇవాల్టితో రూ. 100 కోట్లతో కలుపుకుని మొత్తం రూ. 2,95 కోట్లు జప్తు చేసినట్లు స్పష్టం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
కార్వే స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్ ) దాని సీఎండీ సి. పార్థసారథి, ఇతరులపై మనీ లాండరింగ్ విచారణకు సంబంధించి తాజా ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపింది.
తీసుకున్న రుణాలు నాన్ గా మారాయని ఆరోపించింది. రుణాలు ఇచ్చిన బ్యాంకుల ఫిర్యాదులపై హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
ఈ మేరకు వీటి ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. రూ. 110.70 కోట్ల చరాస్తులను గుర్తించి అటాచ్ చేసినట్లు స్పష్టం చేసింది ఈడీ.
కేఎస్బీఎల్ పరిమిత ప్రయోజన తనిఖీలో డీపీ ఖాతాను వెల్లడించ లేదని , సేకరించిన నిధులను క్రెడిట్ చేయలేదన్న ఆరోపణలతో స్కామ్ బయటకు వచ్చింది.
స్టాక్ బ్రోకర్ క్లయింట్ ఖాతాకు బదులుగా క్లయింట్ సెక్యూరిటీలను తన ఆరు సొంత బ్యాంకు ఖతాలకు తాకట్టు పెట్టింది కార్వే సంస్థ అని పేర్కొంది ఈడీ.
Also Read : అక్రమార్కుల నుంచి 2,828 ఎకరాలు స్వాధీనం