5G Spectrum Auction : కొనసాగుతున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం
రూ. 1.5 లక్షల కోట్ల బిడ్
5G Spectrum Auction : ఒకటి రెండు రోజులలో పూర్తవుతుందనుకున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాల్టితో ఆరో రోజు. ఇప్పటి దాకా భారీ ఎత్తున వేలం పాట నిర్వహించారు.
కేంద్ర సర్కార్ ఈ వేలం పాట ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టాలని చూస్తోంది. అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించగల సామర్థ్యం 5జీ వేలం ద్వారా(5G Spectrum Auction) చేజిక్కించుకున్న కంపెనీలు అందిస్తాయి.
ఒక రకంగా అన్ని రంగాలకు ఇది మరింత అవసరం. ప్రస్తుతం ఉన్న 3జీ, 4జీ కంటే అత్యధిక వేగంతో నెట్ కనెక్టివిటీ అందుతుంది. వినియోగదారులు, కంపెనీలు, సంస్థలకు. దీని వల్ల అదనపు సమయం ఆదా అవుతుంది.
ఈ వేలం పాట ద్వారా మరింత అధిక ఆదాయం పొందాలనే ఉద్దేశంతో మరికొన్ని రోజులు పొడిగించినట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి వెల్లడించారు.
ఐదో రోజు జరిగిన అమ్మకంలో మొత్తం రూ. 1.5 లక్షల కోట్ల బిడ్ ను సంపాదించంది. ఈ ప్రక్రియ రాబోయే కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందన్నారు అశ్విని వైష్ణవ్.
రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో, ప్రత్యర్థులు భారతీ ఎయిర్ టెల్ , వొడా ఫోన్ ఐడియా, బిలియనీర్ గౌతమ్ అదానీ కి చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అన్నీ 5జి ఎయిర్ వేవ్ ల కోసం బిడ్డర్లలో ఉన్నాయి.
ఈ ఏడాది అక్టబోర్ నాటికి 4జీ కంటే 10 రెట్లు వేగంగా డేటా వేగాన్ని అందించగలదంటూ కేంద్ర సర్కార్ చెబుతోంది. రూ. 1, 49, 966 కట్ల విలువైన బిడ్ లను విత్ డ్రా చేసింది.
Also Read : కార్వే గ్రూప్ కేసులో రూ. 100 కోట్ల ఆస్తులు అటాచ్