Virat Kohli : ఆసియా కప్ కు నేను రెడీ
బీసీసీఐ సెలెక్టర్లకు విరాట్ ఫోన్
Virat Kohli : రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా తయారైంది విరాట్ కోహ్లీ పరిస్థితి. ఆ మధ్యన పోయి పోయి బీసీసీఐ బాస్ దాదాతో పెట్టుకున్నాడు. ఈ బెంగాల్ టైగర్ మామూలోడు కాదు. పక్కా రిజల్ట్స్ రావాలంటాడు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఎందుకు ఆడడం లేదన్నది మరోసారి ఆలోచించు కోవాలని ఇటీవల పేర్కొన్నాడు. ఆయన కామెంట్స్ చేసింది ఎవరిమీదో కాదు భారత జట్టుకు ఎనలేని విజయాలు సమకూర్చి పెట్టిన దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) .
ఒకప్పుడు టన్నుల కొద్దీ రన్స్ చేశాడు. కానీ ఇప్పుడు కనీసం ఫోర్లు, సిక్సర్లు కొట్టేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఒకానొక సమయంలో డిఫెన్స్ ఆడేందుకు ట్రై చేయడం అటు అభిమానులను ఇటు మాజీ ఆటగాళ్లను నివ్వెర పోయేలా చేసింది.
ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అయితే ఏకంగా తీసేయండని పేర్కొన్నాడు. అతడి స్థానంలో యంగ్ క్రికెటర్లకు ఛాన్స్ ఇవ్వాలని కోరాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ తరుణంలో రెస్ట్ పేరుతో కోహ్లీని పక్కన పెడుతోంది బీసీసీఐ. దీనిపై క్లారిటీ కూడా ఇస్తోంది. అతడితో పాటు రోహిత్ శర్మ, బుమ్రా, ఇతర ఆటగాళ్లను కూడా చాన్స్ ఇవ్వలేదు.
అయితే ఫామ్ లేని కోహ్లీని(Virat Kohli) ఎందుకు ఎంపిక చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా జింబాబ్వే టూర్ కూడా ఎంపిక చేయలేదు కోహ్లీని. దీంతో తనను పక్కన పెడుతున్నారని భావించాడో ఏమో కోహ్లీనే సెలెక్టర్లకు తానే ఫోన్ చేశాడు.
తాను ఆసియా కప్ కు అందుబాటులో ఉంటానని చెప్పాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు కూడా.
Also Read : జింబాబ్వే టూర్ కు ఇండియా టీం డిక్లేర్