Jeremy Lalrinnunga : వెయిట్ లిఫ్టింగ్ లో జెరెమీ బంగారు ప‌త‌కం

భార‌త దేశానికి కామ‌న్వెల్త్ గేమ్స్ లో రెండో ప‌త‌కం

Jeremy Lalrinnunga : భార‌తీయ క్రీడాకారులు బ్రిట‌న్ లోని బ‌ర్మింగ్ హోమ్ లో జ‌రుగుతున్న కామ‌న్వెల్త్ గేమ్స్ 2022లో దుమ్ము రేపుతున్నాయి. ఇప్ప‌టికే వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరా బాయి చాను బంగారు ప‌త‌కాన్ని సాధించి చ‌రిత్ర సృష్టించింది.

మ‌రో వెయిల్ లిఫ్ట‌ర్ జెరెమీ లాల్రిన్నుంగ (Jeremy Lalrinnunga) ఆదివారం జ‌రిగిన పోటీలో దుమ్ము రేపాడు. భార‌త్ కు రెండో స్వ‌ర్ణ ప‌తకాన్ని అందించాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మొత్తం 160 కిలోల‌ను ఎత్తాడు.

300 కిలోల గ్రాండ్ టోట‌ల్ రికార్డు తో ముగించాడు. పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రిన్నుంగా స్వ‌ర్ణం సాధించ‌డంతో యావ‌త్ భార‌తం సంతోషం వ్య‌క్తం చేస్తోంది.

కామ‌న్వెల్త్ గేమ్స్ లో ఈ స్వ‌ర్ణంతో క‌లుపుకుంటే భార‌త్ ప‌త‌కాల పంట పండుతోంది. స్నాచ్ ఈవెంట్ లో జెరెమీ 140 కిలోల బ‌రువు ఎత్తి కొత్త కామ‌న్వెల్త్ గేమ్స్ రికార్డు సృష్టించాడు.

జెరెమీ త‌న చివ‌రి ప్ర‌య‌త్నంలో 165 కేజీల ముగింపు లో గాయ‌ప‌డిన‌ట్లు క‌నిపించాడు. దానిని పూర్తి చేయ‌డంలో మొద‌ట విఫ‌ల‌మ‌య్యాడు. కానీ చివ‌రి ప్ర‌య‌త్నంలో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

అత‌నితో క‌లిసి ప‌ని చేసిన కోచ్ లు సంతృప్తిని వ్య‌క్తం చేశారు. మిజోరం లోని ఐజ్వాల్ కు చెందిన ఈ 19 ఏళ్ల యువ‌కుడు 2018 యూత్ ఒలింపిక్ గేమ్స్ లో 62 కిలోల ఈవెంట్ లో బంగారు ప‌త‌కం సాధించాడు.

గ‌త కామ‌న్వెల్త్ ఛాంపియ‌న్ షిప్ లో 67 కిలోల విభాగంలో కూడా స్వ‌ర్ణం సాధించాడు. ఇక తాజాగా కామ‌న్వెల్త్ గేమ్స్ 2022లో ఐయోనే ర‌జ‌తం గెలుపొంద‌గా నైజారీయాకు చెందిన ఎడిడియాంగ్ ఉమోఫియో కాంస్యం సాధించాడు.

Also Read : ఆసియా క‌ప్ కు నేను రెడీ

Leave A Reply

Your Email Id will not be published!