Danish Kaneria : కోహ్లీపై డానిష్ కనేరియా షాకింగ్ కామెంట్స్
ఆసియా కప్ కు ఎంపిక చేయక పోవచ్చు
Danish Kaneria : భారత జట్టుకు ఎనలేని విజయాలు సమకూర్చి పెట్టిన స్టార్ బ్యాటర్ గా పేరొందిన విరాట్ కోహ్లీ పరిస్థితి దారుణంగా తయారైంది. గత కొంత కాలం నుంచీ ఒక్క సెంచరీ కూడా లేదు.
పేలవమైన ప్రదర్శనతో ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా బీసీసీఐ ప్రకటించిన జింబాబ్వే వన్డే సీరీస్ జట్టులో కోహ్లీకి ఛాన్స్ ఇస్తారని అంతా భావించారు.
కానీ సీనియర్లకు రెస్ట్ ఇస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ. కానీ ప్రతీసారి కోహ్లీని పక్కన పెట్టడం ఎంత వరకు సబబు అంటూ విరాట్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
ఈ తరుణంలో జింబాబ్వేకు ఎంపిక కాక పోవడంతో ఒకింత షాక్ కు గురయ్యాడు కోహ్లీ. ఆపై వచ్చే నెలలో యూఏఈ వేదికగా ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ జరగనుంది.
ఇందులో కోహ్లీకి ఛాన్స్ ఉంటుందా లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా విరాట్ స్వంతంగా బీసీసీఐ సెలెక్టర్లకు ఫోన్ చేసి తాను అందుబాటులో ఉంటానని చెప్పినట్లు ఓ అధికారి ధ్రువీకరించారు.
ఈ తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా(Danish Kaneria) సంచలన కామెంట్స్ చేశాడు. ట్విట్టర్ వేదికగా ఆదివారం స్పందించాడు. తన స్వంత ఛానెల్ లో కోహ్లీ పర్ ఫార్మెన్స్ , ఎంపిక విషయంపై అంచనా వేశాడు.
ఆసియా కప్ కు విరాట్ కోహ్లీని బీసీసీఐ ఎంపిక చేయక పోవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో డానిష్ కనేరియా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి నెట్టింట్లో.
Also Read : వెయిట్ లిఫ్టింగ్ లో జెరెమీ బంగారు పతకం
Also Read : ఆసియా కప్ కు నేను రెడీ