National Comment : విరాట్ కోహ్లీ ఉన్న‌ట్టా లేన‌ట్టా

క్రికెట్ దిగ్గ‌జానికి ఏమైంది

National Comment :  భార‌త్ అంటే క్రికెట్. క్రికెట్ అంటేనే ఇండియా. స‌మున్న‌త భార‌తావ‌ని గ‌ర్వ ప‌డేది, సంతోష ప‌డేది ఒకే ఒక్క క్ష‌ణంలో భార‌త జ‌ట్టు గెలిచినప్పుడు. కోట్లాది గుండెలు ల‌బ్ డ‌బ్ అని కొట్టుకుంటాయి.

అంత‌లా జోష్ ఉంది కాబ‌ట్టే దానికంత‌టి క్రేజ్. ఇక క్రికెట్ ప్ర‌పంచంలో రారాజుగా నిన్న‌టి దాకా వెలుగొందాడు మెషీన్ గ‌న్ గా పేరొందిన విరాట్ కోహ్లీ. జ‌ట్టుకు మూల స్తంభ‌మ‌య్యాడు.

ఎన్నో విజ‌యాల‌ను అందించాడు. కానీ ఇప్పుడు త‌న కెరీర్ లో ఎన్న‌డూ లేనంతటి ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంటున్నాడు(National Comment). త‌న స‌హ‌జ సిద్ద‌మైన ఆట‌కు పూర్తి భిన్నంగా ఆడుతుండడంతో ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్నాడు.

ఒకానొక ద‌శ‌లో డిఫెన్స్ ఆడేందుకు ట్రై చేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ఎన్న‌డూ ఓట‌మిని ఒప్పుకోని మ‌న‌స్త‌త్వం అత‌డిని హీరోను చేసింది. 133 కోట్ల భార‌తీయులు గ‌ర్వ‌ప‌డేలా చేసింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా అత‌డికి లెక్క‌లేనంత మంది అభిమానులు ఉన్నారు. ప్ర‌త్యేకించి విచిత్రం ఏమిటంటే దాయాది పాకిస్తాన్ లో అమ్మాయిలు, మ‌హిళ‌ల‌కు కోహ్లీ అంటే పిచ్చి ప్రేమ‌.

కానీ ప్ర‌ధానంగా ఆట ప‌రంగా చూస్తే జోష్ లో , హోష్ లో ఫామ్ లో ఉన్న‌ప్పుడే జ‌నం జేజేలు ప‌లుకుతారు. ఆ త‌ర్వాత ఆడ‌క పోతే ప్ర‌శంసిచ‌న నోళ్లు, చ‌ప్ప‌ట్లు కొట్టిన చేతులు విమ‌ర్శించేందుకు సైతం వెనుకాడ‌వు.

ఒక‌ప్పుడు కోహ్లీ ఏం చెబితే అదే వేదం. కానీ బీసీసీఐకి బెంగాల్ టైగ‌ర్ సౌర‌వ్ గంగూలీ వ‌చ్చాక సీన్ మారింది. త‌న‌కు స‌పోర్ట్ గా నిలిచిన ర‌వి శాస్త్రి వెళ్లి పోయాడు. తాను ఒంట‌రై పోయాడు.

కోహ్లీని బీసీసీఐ రెస్ట్ పేరుతో ప‌క్క‌న పెట్టింది. ఆసియా క‌ప్ లోనైనా ఎంపిక అవుతాడా అన్న‌ది అనుమానంగా ఉంది. మ‌రి కోహ్లీ ఉన్న‌ట్టా లేన‌ట్టా.

Also Read : ఆసియా క‌ప్ కు నేను రెడీ

Leave A Reply

Your Email Id will not be published!