AP Comment : టీడీపీ దళపతికి ఎన్నికలు పెను సవాల్
నారా చంద్రబాబు నాయుడికి అగ్ని పరీక్ష
AP Comment : ఈ దేశంలో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన నాయకులలో ఒకరు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఒకరు.
అభివృద్ధి పట్ల ముందు చూపు కలిగిన నాయకుడు. 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం కలిగిన ఈ దళపతికి ఇప్పుడు ఏపీలో రాబోయే ఎన్నికలు పెను సవాల్ గా మారనున్నాయి.
పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ సరైన, దిశా నిర్దేశం చేసే రెండో శ్రేణి నాయకత్వం లేక పోవడం వల్లే కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న విమర్శలు లేక పోలేదు.
ఓటమిని అంత త్వరగా ఒప్పుకునే రకం కాదు చంద్రబాబుది. ఆయనకు మరో పేరు కూడా ఉంది పని రాక్షసుడని. ఉద్యోగుల కారణంగా పవర్ కోల్పోయారు.
ఆపై ప్రపంచ బ్యాంకు జపం చేయడం తన రాజకీయ కెరీర్ పై తీవ్ర దెబ్బ కొట్టేలా చేసింది. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రవేశ పెట్టిన కాంట్రాక్టు వ్యవస్థ ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలను రాచ పుండులా వేధిస్తోంది.
ఎందరో నాయకులను తయారు చేసిన ఘనత చంద్రబాబుదే. ఎవరైనా సరే వాళ్లలో టాలెంట్ ఉంది అంటే చాలు గుర్తించి వెన్ను తట్టి ప్రోత్సహించడం ఆయనకే చెల్లింది.
ఇది పక్కన పెడితే ఒకప్పుడు టీడీపీ అంటే బహుజనులకు చెందిన పార్టీగా పేరుండేది. దేవినేని నెహ్రూ..పరిటాల రవీంద్ర..ఎర్ర సత్యం లాంటి వాళ్లు ఈ పసుపు దళానికి ప్రాణం పోశారు.
కానీ ఆనాటి వైభవం తిరిగి రావాలంటే దళపతి చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu) కొంత మారాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం(AP Comment) వ్యక్తం అవుతోంది.
అందరి అభిప్రాయాలను కలుపుకుని ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లగలిగితే భవిష్యత్తు ఉంటుందన్నది వాస్తవం.
Also Read : చదువు కోవడమే వీళ్లు చేసిన పాపమా