INDW vs PAKW : చెలరేగిన భారత్ తలవంచిన పాకిస్తాన్
8 వికెట్ల తేడాతో ఘన విజయం
INDW vs PAKW : బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ -2022లో తొలిసారిగా ప్రవేశ పెట్టిన విమెన్ మహిళా టోర్నీలో భారత మహిళా జట్టు(INDW vs PAKW) తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మహిళా జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసింది.
ఏకంగా 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. భాతర స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన దెబ్బకు పాక్ బౌలర్లు పరేషాన్ లో పడ్డారు. స్మృతి మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగింది.
42 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు 8 ఫోర్లతో రెచ్చి పోయింది. 63 పరుగులు చేసింది. తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన 14 పరుగులు చేసింది. 102 పరుగుల టార్గెట్ ను 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అంతకు ముందు ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన ఈ కీలక మ్యాచ్ లో ముందుగా పాకిస్తాన్ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ను 99 పరుగులకు కట్టడి చేసింది.
భారత మహిళా బౌలర్లు అద్భుతంగా రాణించారు. స్నేహ రాణా 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. ఇక మరో బౌలర్ రాధా యాదవ్ 18 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసింది.
మిగతా బౌలర్లలో రేణుకా సింగ్ , మేఘనా సింగ్ , షఫాలీ వర్మ చెరో వికెట్ తీశారు. ఇక ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు తరపున బ్యాటర్ మునీబా అలీ ఒక్కతే రాణించింది.
32 బంతులు ఎదుర్కొని 32 రన్స్ చేసింది. అత్యధిక స్కోరర్ గా నిలిచింది. వర్షం కారణంగా మ్యాచ్ ను నిర్వాహకులు 18 ఓవర్లకు కుదించారు. గ్రూప్ -ఎలో ఉన్న భారత్ కు ఇది రెండో మ్యాచ్ కాగా తొలి గెలుపు.
మొదటి మ్యాచ్ లో ఆసిస్ తో 3 వికెట్ల తేడాతో ఓడి పోయింది. ఇక భారత్ 11.4 ఓవర్లలో 102 రన్స్ చేసింది.
Also Read : విరాట్ కోహ్లీ ఉన్నట్టా లేనట్టా