IND vs WI 3rd T20 : ‘యాద‌వ్’ షాన్ దార్ భార‌త్ జోర్దార్

7 వికెట్ల తేడాతో విండీస్ పై విక్ట‌రీ

IND vs WI 3rd T20 : విండీస్ తో జ‌రిగిన మూడో టి20 మ్యాచ్ లో ఎట్ట‌కేల‌కు 7 వికెట్లు తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. సూర్య కుమార్ యాద‌వ్ దంచి కొట్టాడు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

44 బంతులు ఆడిన సూర్య 8 ఫోర్లు 4 సిక్స‌ర్లతో 76 ప‌రుగులు చేశాడు. మ‌రో వైపు రిష‌బ్ పంత్ 26 బాల్స్ ఎదుర్కొని 33 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఇందులో 3 ఫోర్లు ఒక సిక్స‌ర్ ఉంది. వీరిద్ద‌రూ టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఆతిథ్య జ‌ట్టు భార‌త జ‌ట్టు(IND vs WI) ముందు 165 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది.

19 ఓవ‌ర్ల‌లోనే టీమిండియా ప‌ని పూర్తి చేసింది. 3 వికెట్లు కోల్పోయి విజ‌యాన్ని అందుకుంది. ఇక ఇప్ప‌టికే వెట‌ర‌న్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ సార‌థ్యంలో జ‌రిగిన వ‌న్డే సీరీస్ ను చేజిక్కించుకుంది.

ఇక 5 టి20 మ్యాచ్ ల సీరీస్ లో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ ఆధిక్యంలో ఉంది. తొలి టి20 మ్యాచ్ లో ఇండియా గెలిస్తే 2వ టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ దుమ్ము రేపింది.

ఇక మూడో మ్యాచ్ లో భార‌త్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. దీంతో 2-1 తేడాతో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఇక నాలుగో టి20 మ్యాచ్ లో ఆగ‌స్టు 6న జ‌ర‌గ‌నుంది.

అంత‌కు ముందు బ్యాటింగ్ కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 164 ర‌న్స్ చేసింది. ప్ర‌ధానంగా ఓపెన‌ర్ కైల్ మేయ‌ర్స్ సెన్సేష‌న్ ఇన్నింగ్స్ ఆడాడు.

50 బంతులు ఆడి 8 ఫోర్లు 4 సిక్స‌ర్లు కొట్టాడు. 73 ప‌రుగులు చేశాడు. మేయ‌ర్స్ తో పాటు కింగ్ 20, పూర‌న్ 22 ప‌రుగులతో రాణించారు.

Also Read : లాన్ బౌల్స్ లో భార‌త్ కు ప‌సిడి ప‌త‌కం

Leave A Reply

Your Email Id will not be published!