India TT Win : కామ‌న్వెల్త్ గేమ్స్ లో భార‌త్ కు మ‌రో స్వ‌ర్ణం

పురుషుల టేబుల్ టెన్నిస్ ఈవెంట్ లో ప‌త‌కం

India TT Win : బ్రిట‌న్ వేదిక‌గా బ‌ర్మింగ్ హోమ్ లో జ‌రుగుతున్న కామ‌న్వెల్త్ గేమ్స్ -2022లో భార‌త క్రీడాకారులు దుమ్ము రేపుతున్నారు. త‌మ

ప్ర‌తిభా నైపుణ్యంతో స‌త్తా చాటుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు బంగారు ప‌త‌కాలు ద‌క్కాయి భార‌త్ కు. వెయిట్ లిఫ్టింగ్ లో 3 ద‌క్కితే లాన్ బౌల్స్ లో తొలి స్వ‌ర్ణం ద‌క్కింది. ఇక తాజాగా

టేబుల్ టెన్నిస్ టీమ్(India TT Win) ఈవెంట్ లో అద్వితీయ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది.

22వ కామ‌న్వెల్త్ గేమ్స్ లో స‌రికొత్తగా ఈసారి పెద్ద ఎత్తున ప‌త‌కాలు సాధించే ప‌నిలో ప‌డింది భార‌త్. సింగ‌పూర్ తో జ‌రిగిన ఫైన‌ల్లో డిఫెండింగ్

ఛాంపియ‌న్ భార‌త్ 3-1 తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించి మ‌రోసారి టైటిల్ కైవ‌సం చేసుకుంది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు కామ‌న్వెల్త్ గేమ్స్ లో మొత్తంగా భార‌త దేశానికి 11 ప‌త‌కాలు ద‌క్కాయి. ఇందులో 5 స్వ‌ర్ణాలు ద‌క్క‌గా మిగ‌తా 6 ప‌త‌కాలు ర‌జ‌త, కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి.

ఇక మ్యాచ్ ప‌రంగా చూస్తే తొలి మ్యాచ్ లో హ‌ర్మీత్ దేశాయ్ , జీ సాథియ‌న్ జోడీ 13-11, 1-7, 11-5 తేడాతో యంగ్ ఇజాక్ క్వెక్ యో ఎన్ కోన్ పంగ్

జంట‌పై గెలుపొందార‌. దీంతో 1-0 కి పెరిగింది.

అనంత‌రం భార‌త స్టార్ ప్లేయ‌ర్ శ‌ర‌త్ క‌మాల్ ..క్లెరెన్స్ చ్యూ చేతిలో 7-11, 14-12, 3-11, 9-11 తేడాతో ఓట‌మి పాల‌య్యాడు.
మ‌రో మ్యాచ్ లో జీ సాథియ‌న్ – కొన్ పంగ్ పై 12-10, 7-11, 11-7 , 11-4 తేడాతో విజ‌యం సాధించాడు.

అనంతరం జీ సాథియన్.. కొన్ పంగ్‌పై 12-10, 7-11, 11-7, 11-4 తేడాతో గెలుపొంది భారత్‌కు 2-1 ఆధిక్యం అందించగా.. నాలుగో మ్యాచ్‌లో

హర్మీత్ దేశాయ్.. జెడ్‌ చ్యూపై 11-8, 11-5,11-6 వరుస సెట్లలో గెలుపొంది భారత్‌కు గోల్డ్ మెడల్ ఖరారు చేశాడు.

Also Read : లాన్ బౌల్స్ లో భార‌త్ కు ప‌సిడి ప‌త‌కం

Leave A Reply

Your Email Id will not be published!