Telangana Comment : మునుగోడు గోస వినేదెవ్వరు
ఎందుకోసం..ఎవరి కోసం ఈ రాజీనామా
Telangana Comment : తెలంగాణలో రాజకీయం మరింత వేడిని పుట్టిస్తోంది. ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం, స్థాయికి మించి ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం షరా మామూలై పోయింది.
ఒకప్పుడు ప్రజా ప్రతినిధులంటే జనం సమస్యలను ప్రస్తావించే వాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. నీ ఆస్తులు ఎన్ని అనే చిట్టా బయటకు వస్తోంది. ఎన్నికలనేవి స్టేటస్ సింబల్ గా మారింది.
భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ దృష్టిలో ఎన్నికలు అనేవి ప్రజలు ఉపయోగించుకునే శక్తి వంతమైన మాధ్యమమే ఈ వేదిక. ఇందుకు అసలైన సాధనం ఏమిటంటే ఓటు.
అది ఐదేళ్లకు ఒకసారి తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు వాళ్లకు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ అలాంటింది.
ఐదేళ్ల కోసం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్నట్టుండి రాజీనామాలు చేయడం మళ్లీ పోటీకి దిగడం షరా మామూలుగా మారింది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసుడు..తిరిగి గెల్వుడు అన్నది జనాలకు అలవాటు చేసిన ఘనత కేసీఆర్ దే.
ఇక తాజాగా తాను పార్టీని వీడుతున్నానని, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సుదీర్గ రాజకీయ అనుభవం కలిగిన కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ కు నల్లగొండ జిల్లాలో మంచి పట్టుంది.
అది పక్కన పెడితే వ్యక్తిగత ఆరోపణలకు దిగడం, విమర్శలు చేయడం అన్నది మంచి పద్దతి కాదు. ఒక వేళ మౌనంగా ఉన్నా మేలు జరిగేది. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి(Telangana Comment) .
అంత వరకు ఓపిక పట్టి ఉంటే బావుండేది. రాజీనామా చేస్తే ఎన్నికలు నిర్వహించాలి. మళ్లీ సిబ్బంది, బోలెడు ఖర్చు. అభివృద్ధే ఎజెండా కావాలి. ప్రజలు ఇకనైనా మారాలి. ఎందుకు రాజీనామా చేస్తున్నవని అడగాలి.
Also Read : స్కాంలు సరే బకాయిల రద్దు ఎందుకు