CWG 2022 Tulika Mann : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ భళా
దేశం ఖాతాలో మరో 3 పతకాలు
CWG 2022 Tulika Mann : ఈసారి భారత క్రీడాకారులు అద్బుతమైన ప్రతిభా పాటవాలతో ఆకట్టుకుంటున్నారు. బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆశించిన దానికంటే అత్యధిక పతకాలతో అలరించారు.
ఇప్పటి వరకు 5 స్వర్ణాలు మనకు దక్కాయి. తాజాగా మరో మూడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. జూడోలో రజతం దక్కితే వెయిట్ లిఫ్టింగ్ , స్క్వాష్ విభాగాలలో కాంస్య పతకాలు లభించాయి.
ఇక భారత్ కు చెందిన జూడో తులికా మన్(CWG 2022 Tulika Mann) చివరి ఫైట్ లో చేసిన పొరపాట్ల కారణంగా స్వర్ణ పతకాన్ని అందుకోలేక పోయింది. కానీ కాంస్యంతో సరి పెట్టుకుని దేశానికి గర్వ కారణంగా నిలిచింది.
మహిళల ప్లస్ 78 కేజీల ఫైనల్ మ్యాచ్ లో స్కాట్లాండ్ కు చెందిన క్రీడాకారిణి సారా చేతిలో పరాజయం పొందింది. ఇక మెన్స్ స్క్వాష్ పోటీలో భారత్ కు చెందిన సౌరవ్ ఘోషాల్ చరిత్ర సృష్టించాడు.
సింగిల్స్ విభాగంలో గెలుపొంది కాంస్య పతకాన్ని సాధించాడు. మాజీ నంబర్ వన్ గా నిలిచిన ఇంగ్లండ్ కు చెందిన విల్ స్ట్రాప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
11-6, 11-1, 11-4 తేడాతో వరుస సెట్లతో ఖంగుతినిపించాడు. ఇక భారత్ కు సంబంధించి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అత్యధిక పతకాలు దక్కాయి భారత దేశానికి. 109 కేజీల విభాగంలో లవ్ ప్రీత్ 157, 161, 163 కేజీల బరువు ఎత్తాడు.
కాంస్య పతకం పొందాడు. నిఖిత్ జరీన్ , నిసాముద్దీన్ లకు పతకాలు రానున్నాయి. ఇదిలా ఉండగా కామన్వెల్త్ గేమ్స్ లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించిన విజేతలను ప్రశంసలతో ముంచెత్తారు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
Also Read : టీమిండియా షెడ్యూల్ ఖరారు – బీసీసీఐ