INDW vs BAW : సెమీస్ కు చేరిన టీమిండియా
సత్తా చాటిన అమ్మాయిలు
INDW vs BAW : బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స -2022 లో మొదటిసారిగా ప్రవేశ పెట్టిన మహిళా క్రికెట్ ఈవెంట్ లో భారత జట్టు ఎట్టకేలకు సెమీస్ కు చేరింది.
కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో సత్తా చాటింది. ప్రధానంగా భారత మహిళా క్రికెటర్లు చావో రేవో అన్న రీతిలో ఆడారు. బార్బడోస్ తో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా(INDW vs BAW) ఏకంగా 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
కాగా బార్బడోస్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా భారత్ కు బ్యాటింగ్ కు చాన్స్ ఇచ్చింది. భారీ స్కోర్ చేయాలని భావించిన భారత జట్టుకు ఆది లోనే ఎదురు దెబ్బ తగిలింది. మంధాన 5 పరుగులకే వెనుదిరగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సున్నాతో నిరాశ పరిచింది.
ఆ తర్వాత వచ్చిన తానియా కూడా ఎక్కువ సేపు నిలవలేదు. కేవలం ఆరు పరుగులు చేసింది. ఈ తరుణంలో కష్టాల్లో ఉన్న భారత జట్టును గట్టెక్కించారు ఓపెనర్ షఫాలీ వర్మ , రోడ్రిగ్స్ . ఇద్దరూ కలిసి బార్బడోస్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
ఆదిలోనే దెబ్బ కొట్టామని సంతోషించిన వాళ్లకు షాక్ ఇచ్చారు. వర్మ 43 రన్స్ చేస్తే రోడ్రిగ్స్ 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. భారత్ స్కోర్ లో కీలక పాత్ర పోషించారు ఈ ఇద్దరూ.
మరో భారత బ్యాటర్ దీప్తి శర్మ 31 కీలకమైన రన్స్ చేసింది. దీంతో 20 ఓవర్లలో భారత జట్టు 162 పరుగులు చేసింది. అనంతరం 163 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది.
భారత బౌలర్లు రేణుకా సింగ్ రెచ్చి పోవడంతో 62 పరుగులకే చాప చుట్టేశారు.
Also Read : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు 18 పతకాలు