Airtel 5G : 5జీ సేవలకు ఎయిర్ టెల్ రెడీ
ఈనెల లోనే కనెక్టివిటీకి శ్రీకారం
Airtel 5G : యావత్ దేశం ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన 5జీ స్పెక్ట్రం(Airtel 5G) వేలం పాట ముగిసింది. కేంద్ర ప్రభుత్వానికి టెలికాం పరంగా లక్షన్నర కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
ఇది పక్కన పెడితే బిడ్ లో పాల్గొన్న రిలయన్స్ జియో, మిట్టల్ ఎయిర్ టెల్ , వొడా ఫోన్ ఐడియా దేశంలో 5జీ సేవలు అందించేందుకు రంగంలోకి దిగాయి.
తాజాగా జియోకు షాక్ ఇస్తూ ఎయిర్ టెల్ సంచలన ప్రకటన చేసింది. అదేమిటంటే ఈనెల (ఆగస్టు) లోనే అత్యంత స్పీడ్ కనెక్టివిటీ కల్పించే 5 జీ సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయం తీసుకుంది.
దీంతో పోటీ మరింత పెరిగే చాన్స్ ఉందన్నమాట. మొబైల్ తయారీ దారులైన ఎరిక్ సన్ , నోకియా, సామ్ సంగ్ లతో 5జీ నెట్ వర్క్ కు సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఈనెల 10 లోపు వేలంలో బిడ్డింగ్ వేసిన సంస్థలకు స్పెక్ట్రం కేటాయింపులు జరుపుతామని కేంద్రం వెల్లడించింది.
ఈ నెలలోనే 900, 1800, 2100, 33000 మెగా హెట్జ్ లతో పాటు 26 గిగా హెట్జ్ బ్యాండ్లతో మొత్తం 19,876.8 మెగా హెట్జ్ స్పెక్ట్రంను రూ. 43,084 కోట్లకు ఎయిర్ టెల్ చేజిక్కించుకుంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ భాగస్వామ్యం కలిగిన సంస్థలతో మేము ఈ ఉద్విగ్న భరితమైన అనుభవాన్ని వినియోగదారులకు అందించ బోతున్నామంటూ ఎయిర్ టెట్ స్పష్టం చేసింది.
ఇది కనుక ఈనెలలో ప్రారంభం చేస్తే భారత దేశ డిజిటల్ రంగంలో పెను విప్లవం సృష్టించినట్లవుతుందని పేర్కొంది.
Also Read : పార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్టులో ఎల్ఐసీ