Rashmika Mandanna : మేమిద్దరం మంచి స్నేహితులం
విజయ్ దేవరకొండతో లవ్ పై రష్మిక
Rashmika Mandanna : తన నటనతో దేశ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది రష్మిక మంధాన. ఆమె బన్నీతో కలిసి నటించిన పుష్ప దుమ్ము రేపింది. వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది.
కర్ణాటకకు చెందిన రష్మిక ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. పలు సినిమాలలో నటిస్తూ తనదైన ముద్ర కనబరుస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండతో చనువుగా ఉందంటూ పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
లవ్ లో కూరుకు పోయారని , పెళ్లి కూడా చేసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరగడంపై మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ నటి.
తాము ఇద్దరం కలిసి సినిమాలు చేసినంత మాత్రాన ఇలా ఆధారాలు లేకుండా సంబంధాలు అంటగడతారా అంటూ ఫైర్ అయ్యారు. ఆపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రష్మిక మంధాన(Rashmika Mandanna).
తామిద్దరం మంచి స్నేహితులమని, బంధమేమీ లేదని కేవలం స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తను, నేను ఇద్దరం సినిమాలలో బిజీగా ఉన్నామని ఒక్కోసారి షూటింగ్ ల సమయంలో కలుసుకుంటామని చెప్పారు.
దానికి ఇంత రాద్దాంతం చేసేస్తారా అంటూ నిలదీశారు రష్మిక మంధాన. ఇంతకు మించి ఇంకేమీ లేదన్నారు. సోషల్ మీడియాలో ఎవరో ఏదో కామెంట్ చేస్తే వాటిని పట్టించుకుంటారా అని ప్రశ్నించారు రష్మిక.
తాను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నానని చెప్పింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలాయిస్తోంది. ఇక కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించు కుంటోంది.
మొత్తంగా పుష్ప మూవీ ఒకేసారి పాన్ ఇండియా స్టార డమ్ స్వంతం చేసుకుంది రష్మిక మంధాన.
Also Read : మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుపై దావా