Big Scams India : కోట్లు కొల్ల‌గొట్టారు జ‌ల్సా చేస్తున్నారు

ఆర్థిక నేర‌గాళ్ల‌కు అడ్డాగా భార‌త్

Big Scams India : ఈ దేశంలో రోజుకో స్కాం వెలుగులోకి వ‌స్తోంది. గ‌తంలో యూపీఏలో చోటు చేసుకుంటే ఎన్డీయే స‌ర్కార్ లోనూ ఆర్థిక నేర‌గాళ్లు మ‌రింత పెరిగారు. ప్ర‌త్యేకించి స్విస్ బ్యాంకుల్లో(Big Scams India) భార‌తీయుల డ‌బ్బులు మరింత పెర‌గ‌డం విస్తు పోయేలా చేస్తోంది.

75 ఏళ్ల స్వ‌తంత్ర భార‌త దేశంలో ఆర్థిక నేర‌గాళ్లు, మాఫియా డాన్లు, అక్ర‌మార్కులు పెరుగుతూ వ‌స్తున్నారే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా వీళ్ల‌ను కంట్రోల్ చేయ‌డం క‌ష్టంగా మారుతోంది.

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 10 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా ప్ర‌భుత్వ బ్యాంకుల‌ను లూటీ చేశారు. ఇక చెప్పుకుంటూ పోతే ఒక ఏడాది అవుతుంది చాంతాడంత లిస్టు.

స్టాక్ మార్కెట్ లో బిగ్ స్కాంగా పేరొందింది హ‌ర్ష‌ద్ మెహ‌తా స్కాం. ఏకంగా అది రూ. 4,000 కోట్లు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ మాజీ సీఎం స్కాం రూ. 950 కోట్లు.

హ‌వాలా కుంభ‌కోణం రూ. 5,000 కోట్లు కాగా బోఫోర్స్ స్కాం రూ. 64 కోట్లు. న‌రేంద్ర ర‌స్తోగి స్కాం రూ. 43 కోట్ల‌కు పై మాటే. ఇక దాల్మియా కుంభ కోణం రూ. 593 కోట్లు.

ప్ర‌పుల్ ప‌టేల్ కేసు రూ. 50 కోట్లు. యుటీఐ స్కాం రూ. 32 కోట్లు. మ్యూచువ‌ల్ ఫండ్ స్కాం రూ. 1350 కోట్లు, బ‌న్సాలీ స్కాం రూ. 1200 కోట్లు, కేత‌న్ ప‌రేఖ్ సెబీ స్కాం రూ. 888 కోట్లు.

కోబ్ల‌ర్ స్కాం రూ. 1,000 కోట్లు. కేర‌ళ ఎస్ఎన్సీ లావ‌లిన్ విద్యుత్ స్కాం రూ. 374.5 కోట్లు. తెల్గీ స్కాం రూ. 171 కోట్లు. తాజ్ కారిడార్ స్కాం రూ. 175 కోట్లు, మోతీలాల్ గోయ‌ల్ స్కాం రూ. 1,000 కోట్లు,

బెంగాల్ టెలికాం స్కాం రూ. 400 కోట్లు, పాఠ్య పుస్త‌కాల రాకెట్ రూ. 225 కోట్లు, యూరియా కుంభ కోణం రూ. 133 కోట్లు, మేఘాల‌య లాట‌రీ స్కాం రూ. 25,000 కోట్లు, వోక్స్ వ్యాగ‌న్ ఈక్విటీ స్కాం రూ. 11 కోట్లు,

నాఫెడ్ కుంభ‌కోణం రూ. 250 కోట్లు, ఆప‌రేష‌న్ బ్లాక్ బోర్డు స్కాం రూ. 1,000 కోట్లు, బియ్యం కుంభ‌కోణం రూ. 320 కోట్లు, బినామీ డీమ్యాట్ స్కాం రూ. 30 కోట్లు, బినామీ ఐపీఓ స్కాం రూ. 32 కోట్లు, మ‌ద్యం కుంభ‌కోణం రూ. 3,600 కోట్లు ,

ఎంటీఎన్ ఎల్ స్కాం రూ. 450 కోట్లు, చౌతాలా స్కాం రూ. 1400 కోట్లు, బీపీఎల్ రెడ్ కార్డ్స్ స్కామ్ రూ. 1400 కోట్లు. పంజాబ్ ఎస్సీఆర్టీ స్కాం రూ. 3 కోట్లు. బ‌ళ్లారి లంచం కేసు రూ. 150 కోట్లు, డ్యూటీ మిన‌హాయింపు పాస్ బుక్ స్కాం రూ. 10 కోట్లు.

పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ స్కాం రూ. 2.5 కోట్లు. స‌త్యం రామ లింగ రాజు స్కాం పెద్ద‌ది. రూ. 7,000 కోట్ల అకౌంటింగ్ మోసం బ‌హిర్గ‌త‌మైంది. జైలులో ఉన్నాడు.

నీర‌వ్ మోదీది అతి పెద్ద బ్యాంకు మోసం . 2011 నుంచి 2017 మ‌ధ్య జ‌రిగింది. 48 ఏళ్ల వ‌జ్రాల వ్యాపారి పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కు రూ. 11,000 కోట్లు మోసం. యుకెలో ఉన్నాడు.

రోటో మాక్ స్కాం. ఏడు జాతీయ బ్యాంకుల క‌న్సార్టియం ద్వారా రూ. 3,695 కోట్లు ఎగ్గొట్టాడు. బెంగాల్ లో బిగ్ స్కాం . శార‌దా స్కాం. 1.7 మిలియ‌న్ల‌కు పైగా డిపాజిట‌ర్ల నుండి సుమారు రూ. 300 బిలియ‌న్ల‌ను సేక‌రించారు.

విజ‌య్ మాల్యాతో పాటు ఇంకా వంద‌లాది మంది ప్ర‌భుత్వ బ్యాంకుల‌కు క‌న్నం వేశారు. కోట్లాది రూపాయ‌లు కొల్ల‌గొట్టారు. ఐపీఎల్ ను ప్రారంభించిన ల‌లిత్ మోడీ స్కాం కూడా పెద్ద‌దే.

దేశ చ‌రిత్ర‌లో మ‌రో గుజ‌రాత్ కు చెందిన కంపెనీ భారీ మోసానికి పాల్ప‌డింది. ఏబీజీ షిప్ యార్డు డైరెక్ట‌ర్లు, చైర్మ‌న్ ల‌పై సీబీఐ కేసు న‌మ‌దు చేసింది. రూ. 22,842 కోట్లు ఎగ‌నామం పెట్టారు.

వీరే కాకుండా అమీ మోదీ, నీషాల్ మోదీ , ల‌లిత్ మోదీ, విజ‌య్ మాల్యా , జ‌తిన్ మెహ‌తా, చేత‌న్ సందేశ‌ర‌, నితిన్ సందేశ‌ర , రిషి అగ‌ర్వాల్

త‌దిత‌రులు ఉన్నారు. వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ కొల్ల‌గొట్టింది రూ. 6,710 కోట్లు.

Also Read : సుప్రీంకోర్టులో 71 వేల‌ కేసులు పెండింగ్

Leave A Reply

Your Email Id will not be published!