Lalit Modi : నీ అందం అందమైన జలపాతం
సుస్మితా సేన్ పై లలిత్ మోదీ కామెంట్
Lalit Modi : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త గా పేరొందిన లలిత్ మోడీ(Lalit Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రముఖ నటి సుస్మితా సేన్ తో ఆయన డేటింగ్ లో ఉన్నట్టు ఇప్పటికే ఇద్దరూ ప్రకటించారు.
తాజాగా సుస్మితా సేన్ పై లవ్లీగా కామెంట్ చేశారు. నీ అందం అందమైన జలపాతం అంటూ కితాబు ఇచ్చారు లలిత్ మోడీ. సార్దినియాలో హాట్ గా కనిపిస్తున్నావంటూ పేర్కొన్నాడు.
సుస్మితా సేన్ ఇటీవల ఇటలీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక వీడియోను పంచుకున్నారు తన ఇన్ స్టా గ్రామ్ లో. సార్దినియా లోని మెడిటరేనియన్ సముద్రంలో డైవ్ చేసింది.
ఈ సందర్భంగా అలైవ్ ..పాజ్..బ్రీత్ అంటూ పంచుకుంది సుస్మితా సేన్. జీవితం కొద్ది సేపే. ఈ ప్రపంచాన్ని ఆస్వాదించండి. ఆనందం పంచుకోండి. హాయిగా గట్టిగా ఊపిరి పీల్చుకోండి అని కోరింది.
తన అభిమానులకు ఈ సందర్భంగా హ్యాట్సాఫ్ చెప్పింది. తనను ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పింది సుస్మితా సేన్. మధ్యదరా సముద్రంలో ఈత కొట్టడం మరిచి పోలేని అనుభవం. దీనిని మాటల్లో వర్ణించ లేనంటూ పేర్కొంది బాలీవుడి నటి.
సుస్మితా సేన్ పంచుకున్న వీడియోను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది లలిత్ మోడీ. సార్డినియాలో వేడిగా కనిపిస్తున్నావంటూ రాశారు.
48 ఏళ్ల సుస్మిత సేన్ 48 ఏళ్ల లలిత్ మోదీ ఇద్దరూ కలిసి ఉంటున్నారు. కానీ బంధం గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు లలిత్ మోదీ. మేం కలిసి ఉన్నామని ప్రకటించామన్నారు.
Also Read : మీ క్రికెట్ చూసుకోండి మాకు చెప్పకండి