OLA Electric Car : త్వ‌ర‌లో ఓలా ఎల‌క్ట్రిక్ కారు

సిఇఓ భ‌వీష్ అగ‌ర్వాల్

OLA Electric Car : ప్ర‌పంచ వ్యాప్తంగా క్యాబ్ సేవ‌ల‌తో పేరొందిన ఓలా కంపెనీ మ‌రో సంచ‌ల‌నానికి తెర తీసింది. ఇప్ప‌టికే స‌ర్వీసెస్ తో టాప్ లో సేవ‌లు అందిస్తోంది. ఇప్ప‌టికే విద్యుత్ బైక్స్ ను త‌యారు చేసింది.

త‌న హ‌వాను కంటిన్యూ చేస్తోంది ఓలా. ఇప్ప‌టికే కార్ల త‌యారీలో భార‌త్ లో ఉన్న కంపెనీల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది స‌ద‌రు కంపెనీ.

త్వ‌ర‌లోనే మార్కెట్ లోకి ఓలా ఆధ్వ‌ర్యంలో ఎల‌క్ట్రిక్ కారును(OLA Electric Car) తీసుకు రానున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ భ‌వీష్ అగ‌ర్వాల్. సోష‌ల్ మీడియాలో ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

ఈ అంద‌మైన కారును ఆగ‌స్టు 15న ఒక స్పోర్టీ ఎల‌క్ట్రిక్ కారును ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యాన్ని సిఇఓ కార్ లాంచింగ్ ను ధ్రువీక‌రించారు.

ఆజాద్ కీ అమృత్ మ‌హోత్స‌వ్ 75వ ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా కొత్త ప్రాడ‌క్ట్ ను లాంచ్ చేయ‌నున్న‌ట్లు ట్వీట్ చేశారు.

కారుతో పాటు ఓలా నుంచి ఎస్1 స్కూట‌ర్ ను కూడా తీసుకు రానున్న‌ట్లు టాక్. అయితే లాంచ్ ప్రోగ్రాంను పూర్తిగా ఆన్ లైన్ లో స్ట్రీమ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు సిఇఓ భ‌వీష్ అగ‌ర్వాల్.

ఈ కారును త‌క్కువ ధ‌ర‌లో ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ఓలా. వివిధ మోడ‌ల్స్ , క‌ల‌ర్స్ తో కార్లు, స్కూట‌ర్ల‌ను తీసుకు రానుంది.

విచిత్రం ఏమిటంటే ఇప్ప‌టికే టాటా, మ‌హీంద్రా, త‌దిత‌ర కంపెనీలు విద్యుత్ కార్ల‌ను తీసుకు రానుంది. ఇక రాబోయే ఓలా ఎల‌క్ట్రిక్ కారు రూ. 10 ల‌క్ష‌లు గా ఉంటుంద‌ని అంచ‌నా.

Also Read : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!