CWG 2022 India Gold : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు స్వర్ణాలు
రవి కుమార్ దహియా..వినేష్ ఫోగట్
CWG 2022 India Gold : బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స -2022 లో భారత్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. పతకాల వేట కొనసాగుతోంది.
తాజాగా జరిగిన పోటీల్లో రవి కుమార్ దహియా, వినేష్ ఫోగట్ భారత్ కు రెండు బంగారు పతకాలను సాధించి పెట్టారు. పురుషుల 57 కేజీల ఫైనల్ లో నైజీరియాకు చెందిన ఏబికెవెనిమో వెల్సోనిన్ ను ఓడించి రవి కుమార్ దహియా మొదటి పసిడి(CWG 2022 India Gold) పతకాన్ని సాధించాడు.
బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ , దీపక్ పునియా తర్వాత రెజ్లింగ్ లో భారత్ కు ఇది 4వ బంగారు పతకం. వెయిట్ లిఫ్టింగ్ లో మరో స్వర్ణం దక్కింది. మరో వైపు మహిళల 54 కేజీల విభాగంలో వినేష్ ఫోగాట్ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచింది.
ఎల్లో మెటల్ ను కైవసం చేసుకుంది. విజేతను నార్డిక్ వ్యవస్థ నిర్ణయించింది. ఇందులో పోటీలో పాల్గొన్న వారంతా రౌండ్ రాబిన్ పద్దతిలో ఒకరితో ఒకరు ఆడతారు.
ఎక్కువ విజయాలు సాధించిన రెజ్లర్ బంగారు పతకాన్ని పొందుతాడు. వినేష్ ఫోగట్ తన మూడు మ్యాచ్ లను సులభంగా గెలుచు కోవడం విశేషం.
కామన్వెల్త్ క్రీడల్లో వినేష్ కి ఇది మూడో బంగారు పతకం. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్యం, ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు మరో కాంస్య పతకాన్ని సాధించింది.
టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం కోసం అగ్రశ్రేణి పోటీదారుల్లో ఒకరిగా నిలిచింది.
Also Read : ఫైనల్ కు చేరిన భారత మహిళా జట్టు