#DhruvaSarja : ఫ్యాన్సీ రేటుతో ధృవసర్జా పొగరు ప్రతాప్ రాజు సొంతం
Dhruvsarja Pogaru is owned by Pratap Raju at a fancy rate
Dhruva Sarja : పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న దృవ సర్జా తాజాగా పొగరు చిత్రంతో మరొ మారు వెండి తెర మీదకు రానున్నాడు. ఈ అనే టైటిల్ తో కన్నడలో విడుదలైన సినిమా కి వచ్చిన క్రేజ్ ని సొంతం చేసుకుని లాభాలు గడించాలని చాలా మంది తెలుగు రైట్స్ కొసం పొటి పడగా వైజాగ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సియర్, ప్రోడ్యూసర్ డి. ప్రతాప్ రాజు 3 కొట్లకి పైగా ఫ్యాన్సి రేటుతో సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు లొ సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత డి.ప్రతాప్ రాజు మీడియాలో మాట్లాడుతూ.. ఒక్క సాంగ్ తోనే యూట్యూబ్ లో టివి ఛానల్స్ లో 170 మిలియన్స్ పైగా వ్యూస్ తెలుగు లో 43 మిలియన్స్ వ్యూస్ కి పైగా రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకుని ట్రెండింగ్ అవుతున్న పొగరు కన్నడ చిత్రం తెలుగు హక్కులను 3 కొట్ల 30 లక్షలకి సొంతం చేసుకున్నట్టు చెప్పారు. . ఇంత క్రేజ్‌వచ్చిన సినిమాకి మన టాలీవుడ్ నుండి చాలా పెద్ద కాంపిటేషన్ కావటంతో ఈ సినిమాని మా సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి విడుదల చేస్తాం. వరుసగా మూడు సూపర్‌హిట్స్ తో డబుల్ హ్యట్రిక్ సాధించి కన్నడలో దూసుకుపోతున్న దృవ సర్జా, టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. వరుస విజయాలందుకుంటున్న నేచురల్ బ్యూటి రష్మిక మందన్నా ఆతనికి జంటగా నటించింది. ఈ సినిమా దర్శకుడు నందన్ కిషోర్ సినిమాని బాగా తీసాడు. చందన్ శెట్టి, అర్జున్ జన్య లు సంగీత దర్శకుడిగా ఇచ్చిన ప్రతి సాంగ్ సంచలనం . డబ్ల్యూ డబ్ల్యూ లో ఫేమస్ ఫైటర్స్ కాయ్ గ్రీనే, మోర్గన్ అస్తే ,జో లిండర్, జాన్ లోకస్ లు ఈ చిత్రం లో విలన్స్ గా నటిండం తో సినిమాకు కొత్తదనంవచ్చింది. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే మాట్లాడుకుందాం అని ముగించారు.
