#Krack : క్రాక్ కోసం గోవాలో రవితేజ, శృతిహాసన్ ఆట, పాట
Krack : తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్’. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Krack : తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్’. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందిస్తోన్నఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉండటంతో శుక్రవారం (డిసెంబర్ 4) చివరి షెడ్యూల్ లో దీనిని పూర్తి చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. గోవాలో జరగనున్న ఈ షెడ్యూల్‌లో రవితేజ, శ్రుతి హాసన్‌లపై ఈ పాటను చిత్రీకరిస్తుండగా రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూస్తారు.
గోవాల జరిగే ఈ చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవనున్నదని చిత్ర దర్శకుడు మీడియాకు చెప్పారు. అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలతో ఈ సినిమా రూపొందుతున్నట్టు వివరించారు.
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనుండటం విశేషం. ఇటీవల రవితేజ, అప్సరా రాణిపై చిత్రీకరించి, విడుదల చేసిన “భూమ్ బద్దల్” అనే స్పెషల్ సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్టయిన విషయం విదితమే.

No comment allowed please