Ghantasala : నేడు ఘంటసాల జయంతి.

Ghantasala: తెలుగువారికి గానామృతం పంచిన గంధ‌ర్వుడు, పాట‌ల దేవుడిగా కొల‌వ‌బ‌డే ఘంటశాల వెంకటేశ్వరరావు ప్రేమగా పాడుకోవాలన్నా..దేవుడిని భక్తిగా ఆరాధించాలన్నా...

Ghantasala: తెలుగువారికి గానామృతం పంచిన గంధ‌ర్వుడు, పాట‌ల దేవుడిగా కొల‌వ‌బ‌డే ఘంటశాల వెంకటేశ్వరరావు
ప్రేమగా పాడుకోవాలన్నా..దేవుడిని భక్తిగా ఆరాధించాలన్నా… తెలుగు పద్యాలను అలవోకగా ఆలపించాలన్నా,దేశభక్తిని రగిలించాలన్నా.. జానపదాలతో ఉర్రూతలు ఊగించాలన్నా ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆయ‌న దివికేగి అర్ధ‌శ‌తాబ్ధం కావ‌స్తున్నా నేటికీ ప్ర‌తి తెలుగువాడి గుండెగుడిలో త‌న పాట‌ల‌తో చిర‌స్థాయిగా మిగిలిపోయాడు. .. ఈ రోజు ఆయన 99వ జయంతి ఈ సందర్భంగా కొన్ని విశేషాలు

1922 డిశంబర్‌ 4న కృష్ణా జిల్లా గుడివాడ మండలం చౌటపల్లిలో ఘంటశాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి తో పాటుగా గ్రామీణ ప్రాంతంలో పాట‌లు పాడుకునే ఆయ‌న త‌ను గొప్ప‌గాయ‌కుడు కావ‌ల‌న్న‌ తండ్రి ఆశయం నెరవేర్చాలనే త‌ప‌న‌తో కొన్నాళ్లు సంగీత గురుకులం ఉన్నా, అక్కడి కట్టుబాట్లను తట్టుకోలేక తిరిగి సొంత ఊరికి వచ్చేసి సంగీత విద్వాంసుల ఇళ్ళలో పని చేస్తూ సంగీతం అభ్యసించారు. ఆపై సంగీత కళాశాలలో చేరాల‌ని భావించి విజ‌య‌న‌గ‌రంలోని ఏకైక సంగీత కళాశాలలో చేరారు. అద్దె కట్టేందుకు డబ్బు లేక పోవ‌టంతో అక్క‌డే ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో తలదాచుని సంగీతం అభ్య‌సించడం ఆరంభించారు. ఆ గుడికి తరచూ వచ్చే సంగీత విధ్వాసుడు పట్రాయని సీతారామశాస్త్రి ఘంటశాల సంగీతంపై ప‌డుతున్న త‌ప‌న చూసి, ఆత‌ని గురించి ఆరా తీసి, తన ఇంటనే భోజ‌న వ‌స‌తి సౌక‌ర్యాలు ఏర్పాటు చేసి ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చారు. శాస్త్రిగారి సార‌ధ్యంలో సంగీతాన్ని ఔపోస‌న ప‌ట్టిన ఘంట‌శాల మాస్టారు 4 సంవ‌త్స‌రాల కోర్సును కేవ‌లం రెండేళ్ల‌లోనే పూర్తి చేసి ఔరా అనిపించుకున్నారు.

త‌దుప‌రి 1942లో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండు సంవత్సరాలు అలీపూర్‌ జైల్లో జైలు శిక్ష అనుభవించారు. 1944 మార్చి4న సావిత్రమ్మతో పెళ్ళి జరిగింది. తన పెళ్ళిలో తనే కచేరి చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు ఘంటసాల. ఘంటశాలలోని గాన సామర్థ్యాన్ని గుర్తించిన సముద్రాల నాటి మద్రాసులోని రేణుకా ఫిలింస్‌కు తీసుకువెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్‌ రెడ్డిలకు ఎదుట పాటకచ్చేరీ చేయించారు. తరువాత ఘంటశాల తన మకాంను పానగల్‌ పార్కుకు మార్చారు. పగలంతా అవకాశాల కోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించడం ప‌రిపాటిగా మారిన త‌రుణంలో. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలిత గీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు.

పాటలు పాడుతూ సినీరంగంలో చిన్న చిన్న వేషాలు వేసుకుని జీవ‌నం సాగిస్తున్న ఆత‌నికి 1947లో లక్ష్మమ్మ చిత్రానికి సంగీత దర్శకునిగా అవ‌కాశం వ‌చ్చింది. . 100 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహించారు.

1969-72 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్ధాన గాయకునిగా కొనసాగారు. 1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1969 నుంచి తరచూ ఘంటశాల అనారోగ్యానికి గురయ్యేవారు. 1971లో ఐరోపా, ఆమెరికాలో ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ఘంటశాలకు గుండెనొప్పి వచ్చింది. హుటాహుటీన అక్కడి ఆసుపత్రికి తరలించారు. అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలనే కోరిక కలిగింది. భగవద్గీత పూర్తి చేసి సినిమా పాటలు పాడుకూడదని నిర్ణయించుకున్నారు. 1972లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు వంటి హిట్‌ చిత్రాలకు పాటలు పాడారు.

ఘంటశాల గొంతు నుండి జాలువారిన భగవద్గీత శ్లోకాలు నేడు పార్థివ దేహాల వద్ద ఆలపించే పాటలుగా మార‌టం ఆందోళ‌న క‌లిగించేదే. 1974 ఫిబ్రవరి 11న మరణించిన గాన మాధుర్యం నేటికీ మ‌న తోడుగా న‌డుస్తునే ఉంటుంది.

No comment allowed please