ష‌బ్బీర్ అలీపై గడ్డం ఇందుప్రియా రెడ్డి ఫైర్

మ‌హేష్ కుమార్ గౌడ్ పై ఆరోప‌ణ‌లు అబ‌ద్దం

కామారెడ్డి జిల్లా : కామారెడ్డిలో తారాస్థాయికి చేరుకున్నాయి రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి , షబ్బీర్ అలీ గ్రూప్ మధ్య విబేధాలు. ఈ సంద‌ర్బంగా టీపీసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గ‌డ్డం చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి భార్య గ‌డ్డం ఇందు ప్రియా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె మీడియాతో మాట్లాడారు. మహేష్ కుమార్ గౌడ్ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేద‌న్నారు. షబ్బీర్ అలీని బహిరంగంగా హెచ్చరించారు. ఈ సంద‌ర్భంగా త‌న భ‌ర్త‌పై, త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ష‌బ్బీర్ అలీపై పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశాన‌ని చెప్పారు. షబ్బీర్ అలీ అన్న కొడుకు షేరు నన్ను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నాడని ఆరోపించారు.తాను క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాననే నా మీద కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

తాను , త‌న భ‌ర్త భర్త చంద్రశేఖర్ రెడ్డి నిత్యం ప్రజా సేవలోనే ఉంటామ‌న్నారు. సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే షబ్బీర్ అలీ మహిళల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? అని సీరియ‌స్ గా ప్ర‌శ్నించారు. బయట దేశాల నుండి షబ్బీర్ ఆలీ సోషల్ మీడియాలో నా మీద అసభ్య పోస్టులు పెట్టిస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చర్ల రాజేష్ అనే సీనియర్ నాయకుడిని నేను బాబాయ్ అని పిలుస్తాను, అతను కూడా నా మీద వేసిన ట్రోల్స్ అన్ని గ్రూపులో షేర్ చేశాడన్నారు. నా గురించి ప్రచారం చేసేటప్పుడు మీ ఇంట్లో కోడలు, భార్య గుర్తుకు రాలేదా అని నిల‌దీశారు గ‌డ్డం ఇందుప్రియా రెడ్డి. షబ్బీర్ అలీ అరాచకాల గురించి రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!