బీజేపీకి షెహ‌జాద్ పూనావాలా గుడ్ బై..?

త‌న ఎక్స్ ఖాతాలో బీజేపీ పేరు తొల‌గింపు

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఏం జ‌రుగుతోంద‌నేది ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. నిన్న‌టి దాకా ఆ పార్టీకి గొంతుక‌గా ఉంటూ వ‌చ్చిన జాతీయ అధికార ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌ముఖ కాషాయ నేత షెహ‌జాద్ పూనావాలా ఉన్న‌ట్టుండి పార్టీ నుండి త‌ప్పుకోనున్నారా. తాజాగా సామాజిక వేదిక ఎక్స్ లో ఆయ‌న త‌న పార్టీకి చెందిన బీజేపీ లోగోను తొల‌గించారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న మౌనంగా ఉన్నారు. ఇవాళ చ‌ర్చ‌కు దారితీసేలా చేశారు పూనావాలా. పార్టీ లోగోకు బ‌దులు తన అప్‌డేట్ చేసిన ఎక్స్ బయోలో మతం, ఇస్లాం, సంస్కృతి, హిందూ, భారతీయ భావజాలం అని పేర్కొన్నారు. ఇది ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ ప‌దాలు సెక్యూలరిజంకు సంబంధించిన‌వి కావ‌డం విశేషం. బీజేపీ నినాదం ఒక్క‌టే ఒకే దేశం ఒకే పార్టీ. ఇది న‌ర‌హంత‌కుడు హిట్ల‌ర్ నుంచి స్పూర్తి పొందింది.

అయితే పూనావాలా తన ‘X’ బయోను అప్‌డేట్ చేస్తూ అందులో బీజేపీ ప్రస్తావనను తొలగించారు, దీనితో ఆయన పార్టీకి రాజీనామా చేసి ఉండవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. పూనావాలాను సంప్రదించడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. తన అప్‌డేట్ చేసిన బయోలో మతం, ఇస్లాం, సంస్కృతి, హిందూ, భారతీయ భావజాలం, జీఎస్టీ కి యాత్ర’ పుస్తక రచయిత అని మాత్ర‌మే పేర్కొన్నారు. అంతేకాకుండా తన అప్‌డేట్ చేసిన బయో స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన పోస్ట్ చేశారు. క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకునే సమయం ఆసన్నమైందని సూచిస్తూ బీజేపీ నుండి నిష్క్రమించే సంకేతాలు ఇచ్చిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. వివిధ ఇంటర్వ్యూలలో తాను చేసిన ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఆయన మళ్లీ పోస్ట్ చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!