హైదరాబాద్ : ఇప్పుడు దేశ వ్యాప్తంగా హనుమాన్ అంశ్ చిత్రం చర్చకు దారితీసేలా చేసింది. ఈ సినిమా పూర్తిగా ప్రముఖ ఆధ్యాత్మమిక గురు నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా తీశారు. భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరిగా గుర్తిపు పొందారు. ఆయనను భక్తులు ప్రేమగా మహారాజ్జీ అని పిలుస్తారు. ఆయన ప్రధానంగా హనుమంతుడి భక్తి, సేవ, ప్రేమను బోధించారు. వాస్తవానికి నీమ్ కరోలీ బాబా అసలు పేరు లక్ష్మీ నారాయణ్ శర్మ. ఉత్తరప్రదేశ్‌లోని అకబర్పూర్ ప్రాంతం ఆయన స్వస్థలం. చిన్న వయస్సులోనే ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులయ్యారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని నీమ్ కరోలీ ప్రాంతంలో కొంతకాలం నివసించినందున ప్రజలు ఆయనను నీమ్ కరోలి బాబా అని పిలవడం ప్రారంభించారు.
ఆయన జీవితంలో అనేక అద్భుత సంఘటనలు జరిగాయని భక్తులు నమ్ముతారు. అయితే వీటిలో చాలా విషయాలకు స్వతంత్ర చారిత్రక ఆధారాలు లేవు. ఆయనతో అత్యంతగా అనుబంధం ఉన్న ప్రదేశం కైన్చీ ధామ్ .ఇది ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ సమీపంలో ఉంది. ఇక్కడ ప్రధానంగా హనుమాన్ ఆలయం, ఆశ్రమం ఉన్నాయి.ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు కైన్చీ ధామ్‌ను సందర్శిస్తారు. 1960–70 దశకాల్లో పలువురు పాశ్చాత్యులు ఆయనను కలుసు కోవడంతో ఆయన పేరు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. తనను ప్రేమించి, గౌరవించి, కలిసిన వారిలో స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్ బర్గ్ , లారీ బ్రిలియంట్ , రామ్ దాస్ ఉన్నారు. వీరితో నీమ్ కరోలి బాబాకు సంబంధించిన కథలు, అనుభవాలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆయన ప్రధానంగా మూడింటిని బోధించారు. ప్రతి మనిషిని ప్రేమతో చూడాలి.
పేదలకు, అవసరంలో ఉన్నవారికి సేవ చేయడం ఆధ్యాత్మిక సాధనలో భాగమని ఆయన బోధించారు.
ప్రార్థన, భక్తి, నిస్వార్థ సేవ ద్వారా మనసుకు శాంతి పొందాలని చెప్పారు.ప్రేమించు, సేవ చేయి. స్మరించు ఇవే ఆయన బోదించినవి. నీమ్ కరోలి బాబా 11 సెప్టెంబర్ 1973న వృందావన్‌లో మరణించారు.ఆయన భౌతికంగా లేకపోయినా కైన్చీ ధామ్ బోధనలు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది భక్తులను ప్రభావితం చేస్తున్నాయి. నీమ్ కరోలి బాబా గొప్ప తత్వశాస్త్ర గ్రంథాలు రాయడం కంటే ప్రేమ, సేవ, భక్తి, సరళమైన జీవితంపై దృష్టి పెట్టారు. అందుకే ఆయనను అనుసరించే భక్తులు ఆయనను కేవలం గురువుగా కాకుండా ఆధ్యాత్మిక మార్గదర్శిగా భావిస్తారు.