50 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘సింగ‌రేణి’ రైలు

బెల్లంప‌ల్లి నుండి జిమ్మికుంట మ‌ధ్య

క‌రీంన‌గ‌ర్ జిల్లా : భార‌త‌దేశంలోనే అరుదైన ఘ‌న‌త సాధించింది తెలంగాణ‌లోని సింగ‌రేణి. ఇదిలా ఉండ‌గా సింగ‌రేణి పేరుతో న‌డిపిస్తున్న రైలు చ‌రిత్ర సృష్టించింది. ఈ రైలు ప్రారంభించి ఈ ఏడాది తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. తొలుత‌ బెల్లంపల్లి నుండి జమ్మికుంట మధ్య రైలు న‌డిపారు. ఈ రైలులో తరచుగా రద్దీ ఉండేది. ప్రయాణికుల డిమాండ్ పెరగడంత ఈ సేవను సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు పొడిగించారు. సింగరేణి బొగ్గు క్షేత్రంలో సుపరిచితమైన ‘సింగరేణి రైలు’ సేవ 50 ఏళ్లు పూర్తి చేసుకోవ‌డం మామూలు విష‌యం కాదు. సింగరేణి ఉద్యోగులే కాకుండా, ఇతర వర్గాల ప్రజలు కూడా ఈ సేవను వినియోగించు కుంటున్నారు గ‌త కొన్నేళ్లుగా. 1960లలో రామగుండం, బెల్లంపల్లి , మందమర్రి ప్రాంతాలలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ బొగ్గు వెలికితీత పనులను ప్రారంభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తో పాటు పొరుగు జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కార్మికులు బొగ్గు గనుల్లో ఉద్యోగాల్లో చేరారు.

ఆ సమయంలో రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉండటంతో కార్మికులు పనికి వెళ్లడానికి ఇబ్బందులు పడేవారు. ఉత్తర , దక్షిణ భారతదేశాన్ని కలిపే ప్రధాన రైల్వే లైన్ ఈ జిల్లా గుండా వెళుతున్నప్పటికీ, అనేక స్టేషన్లలో రైలు ఆగే సదుపాయం ఉండేది కాదు. కార్మికుల సౌకర్యార్థం రైల్వే శాఖ బొగ్గు గనుల ప్రాంతాలను అనుసంధానిస్తూ ఒక రైలు సేవను ప్రవేశ పెట్టి, దానికి ‘సింగరేణి’ అని పేరు పెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 1976 సెప్టెంబర్ 2న ఈ రైలు సేవను ప్రారంభించారు. ప్రారంభంల, ఈ రైలు బెల్లంపల్లి , కొత్తగూడెం (భద్రాచలం రోడ్) మధ్య నడిచేది. అధికారిక పనుల కోసం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయానికి వెళ్లడానికి , ఆసుపత్రి సేవలను పొందడానికి ఇది కార్మికులకు ఎంతో సహాయపడింది. కొత్తగూడెంలోని సింగరేణి కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ సేవను వినియోగించు కునేవారు. సింగరేణి కార్మికులు నివసించే ప్రాంతాలకు పాలను తరలించడానికి పాడి రైతులు కూడా ఈ రైలును ఉపయోగించేవారు.

Leave A Reply

Your Email Id will not be published!