అమరావతి : సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా పేరు పొందిన పవన్ కళ్యాణ్ కొణిదల పుట్టిన రోజు ఇవాళ. ఆయన ఫిబ్రవరి 2, 1971లో మొగల్తూరులో పుట్టారు. ఆయన తండ్రి ఓ సాధారణ కానిస్టేబుల్. తల్లి ఉన్నారు. ఆయనకు ఇద్దరు సోదరులు ఒకరు మెగాస్టార్ చిరంజీవి, మరొకరు నాగేంద్ర బాబు. సినీ రంగంలో తనదైన ముద్ర కనబర్చారు. రాజకీయాల్లో ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన విజయం సాధించి ఏకంగా ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. అటు సినీ రంగానికి చెందిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు కూడా పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.
సినిమాల్లో ఒక సంచలనంగా, రాజకీయాల్లో ఒక పోరాట యోధుడిగా , అభిమానులకు “పవర్ స్టార్” గా, జనసేనానిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన వ్యక్తిగా ఎదిగాడు పవన్ కళ్యాణ్. నేడు 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ కుమార్. తండ్రి కొణిదెల వెంకటరావు, తల్లి అంజనా దేవి. సినిమా కుటుంబంలో జన్మించినప్పటికీ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. 1996లో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమాతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ఆయనకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాలు ఆయన కెరీర్‌లో కీలకంగా నిలిచాయి. ముఖ్యంగా “ఖుషి” తర్వాత పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ మరింత పెరిగింది.
పవన్ కళ్యాణ్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ మాస్టర్ గా, గాయకుడిగా తన ప్రతిభను చూపించారు. “జానీ” సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాల్లో ఆయన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఫైటింగ్ స్టైల్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ఆయనకు “పవర్ స్టార్” అనే బిరుదు బలంగా స్థిరపడింది. సినిమా రంగంలో భారీ స్టార్‌డమ్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ దృష్టి రాజకీయాల వైపు మళ్లింది.2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు.ప్రజా సమస్యలపై పోరాడటం, అవినీతికి వ్యతిరేకంగా నిలబడటం, యువతను రాజకీయాల్లోకి తీసుకు రావడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. 2014 ఎన్నికల్లో జనసేన ప్రత్యక్షంగా పోటీ చేయకుండా BJP–TDP కూటమికి మద్దతు ఇచ్చింది.
2019లో జనసేన పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. గాజువాక, భీమవరం. కానీ రెండు చోట్లా ఓటమి ఎదురైంది. ఈ ఓటమి తర్వాత కూడా ఆయన రాజకీయాలను వదిలి పెట్టలేదు. ఇదే ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక కీలక మలుపు. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై మరింత దృష్టి పెట్టారు. జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన, తెలుగుదేశం పార్టీ, BJP కలిసి NDA కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.ఈసారి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు.జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం ఆ పార్టీ రాజకీయ చరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా నిలిచింది.
NDA కూటమి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
