తమిళనాడు అసెంబ్లీ, సచివాలయాలు త‌ర‌లింపు..?

ప్ర‌స్తుత అసెంబ్లీ స‌మావేశంలోనే సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న

చెన్నై : ఘన‌మైన చ‌రిత్ర‌కు ద‌ర్ప‌ణంగా నిలిచిన త‌మిళ‌నాడు శాస‌న స‌భ‌, స‌చివాల‌యాల‌ను త్వ‌ర‌లోనే త‌ర‌లించ‌నున్నారు. తమిళనాడు ప్రభుత్వం, శాసనసభకు కేంద్రంగా ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుండి వీటిని తరలించడం అనేది రాష్ట్రానికి ఒక ముఖ్యమైన పరిపాలనా పరమైన మార్పు కానుంది. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాంగణం నుండి శాసనసభ , సచివాలయాలను తరలించే ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం వీటిని ఒక కొత్త సమీకృత కాంప్లెక్స్‌కు తరలించే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రతిపాదిత సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రస్తుతం నాలుగు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. వీటిలో పట్టణపాక్కం, నందంబక్కం, కోయంబేడు , గిండిలోని హైవేస్ డిపార్ట్‌మెంట్ కార్యాలయ ప్రాంగణం ఉన్నాయి.

పరాందూర్ విమానాశ్రయ ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలోని ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రాజకీయ చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అంతకు ముందు ఆగస్టు 25న ప్ర‌తిపాదిత‌త‌ పరాందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేసే నిర్ణయంపై అసెంబ్లీలో అధికార ‘తమిళగ వెట్రి కళగం’ ప్రతిపక్ష ‘ద్రవిడ మున్నేట్ర కళగం’ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందారని ఆరోపించ బడుతున్న వారి గురించి ప్రస్తావిస్తూ న్యాయశాఖ మంత్రి నిర్మల్ కుమార్ “జి స్క్వేర్ మాపిల్లై” గురించి ప్రస్తావించారు. విమానాశ్రయానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక విడుదల కాకముందే ఒక రాజకీయ పార్టీకి చెందిన రియల్టర్లు పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారని మంత్రి ఆధవ్ అర్జున ఆరోపించారు. ఈ వాగ్వాదం సందర్భంగా డీఎంకే ఎమ్మెల్యే తంగం తెన్నరసు అధికార పార్టీపై ఎదురుదాడి చేశారు.

ఏ లాటరీ అల్లుడి కోసం ఈ కొత్త విమానాశ్రయ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు అని ప్రశ్నించారు. ప్రతిపాదిత పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేసి, ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తిస్తున్నట్లు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రూల్ 110 కింద ప్రకటించిన నేపథ్యంలో ఈ మాటల యుద్ధం జరిగింది. ఈ నిర్ణయాన్ని వివరిస్తూ విజయ్ పర్యావరణ సమస్యలు, వ్యవసాయ భూములపై ప్రభావం, స్థానికుల జీవనోపాధికి సంభవించే నష్టాన్ని ఉదహరించారు. దీర్ఘకాలిక ప్రయాణీకుల, పారిశ్రామిక, సరుకు రవాణా అవసరాలను తీర్చడానికి చెన్నైకి రెండవ విమానాశ్రయం అవసరమని, అయితే ఈ అభివృద్ధి స్థానిక వర్గాల ప్రయోజనాలకు నష్టం కలిగించ కూడదని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిపుణులతో సంప్రదించి విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించ నుందని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!