పారిశ్రామిక హ‌బ్ గా ‘అన‌కాప‌ల్లి’ కాబోతోంది

ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వ‌స్తున్నాయ‌ని, పెట్టుబ‌డిదారులు, కంపెనీలు ఏపీకి క్యూ క‌డుతున్నాయ‌ని చెప్పారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని చెప్పారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో అన‌కాప‌ల్లి పారిశ్రామిక రంగానికి కేరాఫ్ గా మారుతుంద‌న్నారు. ఇందుకు కావాల్సిన స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌న్నారు. ఆరు నెలల క్రితం అనకాపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. పెద్ద డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయని, ఆసియా మొత్తాన్ని అనుసంధానించే సబ్‌సీ కేబుల్‌ కనెక్టివిటీ కూడా రానుందని తెలిపారు. హార్బర్లు, మూలపేట పోర్టుల ద్వారా తూర్పు తీరాన్ని మధ్య భారత్‌తో అనుసంధానిస్తా మన్నారు. హైదరాబాద్‌ సమీపంలోని రంగారెడ్డి తరహాలో అనకాపల్లి అభివృద్ధికి చిరునామాగా మారుతుందని స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లడం కాదు..ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే పరిస్థితి వస్తుందని. ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్రగా మారుతుందని వివరించారు. విశాఖ ఇక ఏఐ పట్నంగా మారుతుందని తెలిపారు. గూగుల్‌ హబ్‌గా, నాలెడ్జ్‌ ఎకానమీ కేంద్రంగా, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుందని చెప్పారు. డేటా సెంటర్లకు నీరు, విద్యుత్‌ కొరత వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటితో పోలిస్తే పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అన్ని డేటా సెంటర్లకూ కేవలం 5 టీఎంసీల నీరు సరిపోతుందన్నారు. ఎడమ కాలువ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు తీసుకెళ్లే సామర్ధ్యం ఉందని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!