హైదరాబాద్ : ఆసిస్ బౌలర్ స్టార్క్ అరుదైన ఘనతను సాధించాడు. మిచెల్ స్టార్క్ నంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేశాడు. బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో సాధించిన విజయంలో స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. అతను రెండు ఇన్నింగ్స్ లలో అద్భుతమై ప్రదర్శన చేశాడు. 12 పరుగులకు 6 వికెట్లు, 39 పరుగులకు 4 వికెట్లు తీసి మాట్ హెన్రీ , జస్ప్రీత్ బుమ్రాలను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు . వీరి కంటే స్టార్క్ 10 రేటింగ్ పాయింట్లు ముందున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో భాగంగా మెక్‌కే వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. మిచెల్ స్టార్క్, తన కెరీర్‌లో మొదటిసారిగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు.
36 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బౌలర్ ఇన్నింగ్స్ 51 పరుగుల విజయానికి ప్రధాన కారణమయ్యాడు. అగ్రస్థానంలో బుమ్రా తాజా హయాం కేవలం రెండు నెలలు మాత్రమే కొనసాగినప్పటికీ, నంబర్ వన్‌గా అతను మొత్తం 697 రోజులు కొనసాగాడు.. భారతీయ బౌలర్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 14వ అత్యధికం. గాయం కారణంగా బుమ్రా శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌కు దూరమయ్యాడు. స్టార్క్ గతంలో అత్యుత్తమంగా రెండో స్థానాన్ని సాధించాడు.. ఇప్పుడు అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను గెలుచుకున్నాడు. లీడ్స్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల విజయానికి సహకరించిన ఇంగ్లాండ్ సీమ్ బౌలర్ ఆలీ రాబిన్సన్ కూడా గణనీయమైన పురోగతి సాధించాడు. 51 పరుగులకు 5 వికెట్లు , 39 పరుగులకు 3 వికెట్లు తీసిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకోవడంతో పాటు, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు.
