ముంబై : అమేథీ ఎంపీ , కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసును కొట్టి వేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టి వేసింది. కోర్టు మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్ల (కోర్టుకు హాజరు కావాలనే ఆదేశం) ఉత్తర్వును సమర్థించింది, అదే సమయంలో గాంధీకి వ్యక్తిగతంగా హాజరు కాకుండా ఆరు వారాల పాటు మినహాయింపు ఇచ్చింది. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీపై చేసినట్లు ఆరోపించ బడిన వ్యాఖ్యల విషయంలో తనపై జరుగుతున్న క్రిమినల్ పరువు నష్టం విచారణను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను బాంబే హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 482 కింద జోక్యం చేసుకోవాల్సినంత స్పష్టమైన చట్ట విరుద్ధత లేదా అక్రమం ఏమీ లేదని పేర్కొంటూ, ప్రతిపక్ష నాయకుడు గాంధీకి సమన్లు
బీజేపీ ఒక నమోదిత జాతీయ రాజకీయ పార్టీ కాబట్టి అది గుర్తించ దగిన సంస్థ అని పేర్కొంటూ బీజేపీ సభ్యుడు దాఖలు చేసిన ఫిర్యాదు నిలవదని ఆ నాయకుడు చేసిన వాదనను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. సమన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించే దశలో, ప్రతిపక్ష నాయకుడు గాంధీ చేసినట్లు ఆరోపించబడిన వ్యాఖ్యలు కేవలం బీజేపీ అగ్ర నాయకత్వానికి మాత్రమే పరిమితమయ్యాయని చెప్పలేమని జస్టిస్ బోర్కర్ అభిప్రాయపడ్డారు.