హైదరాబాద్ : ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీ ఎమ్మెలయే రామేశ్వర్ శర్మను ఏకి పారేశారు. దమ్ముంటే ఖాజీ క్యాంప్ పై క్షిపణిని ప్రయోగించాలని సవాల్ విసిరారు. ఆ ప్రాంత చారిత్రక వారసత్వాన్ని, భారత స్వాతంత్ర ఉద్యమంలో ముస్లిం విప్లవకారుల పాత్రను ప్రస్తావించారు. బీజేపీ నాయకుడిని “బలహీనుడు” అని కొట్టి పారేశారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు ఓవైసీ. భోపాల్ స్వాతంత్ర పోరాటంతో సంబంధం ఉన్న ప్రముఖ చారిత్రక వ్యక్తుల పేర్లను ప్రస్తావించారు. భోపాల్‌లోని ఖాజీ క్యాంప్‌పై క్షిపణి ప్రయోగిస్తామన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ బహిరంగ సవాలు విసిరారు. ఆ ప్రాంతంలో ఒంటరిగా నిలబడి దానిని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. బహిరంగ సభలో ప్రసంగిస్తూ భోపాల్‌లోని మైనారిటీలు అధికంగా నివసించే ఖాజీ క్యాంప్ ప్రాంతం వైపు కరొండ్ స్క్వేర్ నుండి క్షిపణిని ప్రయోగిస్తానని మధ్యప్రదేశ్ బీజేపీ శాసనసభ్యుడు చేసినట్లుగా వస్తున్న వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ తీవ్రంగా స్పందించారు.
వినండి, బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ, మీరు నిజంగా మీ తల్లి కొడుకే అయితే, దాన్ని ఎప్పుడు ప్రయోగిస్తారో చెప్పండి? నేను ఒంటరిగా వచ్చి ఖాజీ క్యాంప్‌లో నిలబడతాను. నేను అమర వీరుడవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు ఓవైసీ. నేను చావడానికి సిద్ధం అన్నారు. అంతే కాకుండా మీలాంటి వారి ముందు తలవంచే వ్యక్తిని నేను కాను అని స్పష్టం చేశారు. రామేశ్వర్ శర్మ, ఖాజీ క్యాంప్ అంటే ఏమిటో వినండి. ఆ స్వాతంత్ర సమరయోధులు (ముజాహిదీన్-ఎ-ఆజాదీ) ఎవరు? ఖాజీ సయ్యద్ అబిద్ అలీ, వాజిద్ అలీ హుస్సేనీ—వారు ఎవరు? ఖాన్ షహాదత్ అలీ ఖాన్, ఫజిల్ మహమ్మద్ ఖాన్, ఆదిల్ ఖాన్, షేక్ రంజాన్, సాదత్ ఖాన్, రిసాల్దార్ వలీ షా? అని ఒవైసీ ప్రశ్నించారు. విదేశాంగ విధానం, సరిహద్దు ఉద్రిక్తతలపై కేంద్ర నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ, పాకిస్థాన్‌తో ఘర్షణల సమయంలో బీజేపీ ప్రభుత్వ వైఖరిపై ఒవైసీ తీవ్రంగా విమర్శించారు. ఎక్స్ వేదికగా ఓవైసీ ఓ వీడియో విడుదల చేశారు.
