ద‌ళ‌ప‌తి విజ‌య్ అభిమానుల‌తో స‌మావేశం ర‌ద్దు

తీవ్ర నిరాశ‌కు గురైన జోసెఫ్ విజ‌య్ ఫ్యాన్స్ గ‌ణం

ఇంగ్లండ్ : లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. త‌న టూర్ లో భాగంగా త‌న‌ను ఆరాధించి, ప్రేమించే అభిమానుల కోరిక మేర‌కు వీరితో క‌లిసేందుకు ఓకే చెప్పారు. అయితే త‌న భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా లండ‌న్ పోలీసులు త‌న ఫ్యాన్స్ తో స‌మావేశం అయ్యేందుకు కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు. దీంతో ద‌ళ‌ప‌తి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. విచిత్రం ఏమిటంటే త‌మిళ‌నాట చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుల‌లో ర‌జ‌నీకాంత్ త‌ర్వాత విజ‌య్ ఒక‌డు. ఆయ‌న‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీరిని న‌మ్ముకునే విజ‌య్ గ‌త రెండు ఏళ్ల కింద‌ట టీవీకే పార్టీని ఏర్పాటు చేశారు.

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సుదీర్ఘ‌మైన రాజ‌కీయ నేప‌థ్యం, చ‌రిత్ర , వార‌స‌త్వం క‌లిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల‌ను తోసి రాజేలా చేశారు. ఆపై భారీ మెజారిటీతో కొంద‌రి మ‌ద్ద‌తుతో టీవీకే కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు విజ‌య్. ఇక ఫ్యాన్స్ తో క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేసిన విజ‌య్ టీంకు నిరాశే మిగిలింది. లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు. దీంతో, ఆ సమావేశ కార్యక్రమాన్ని రద్దు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.ప్రజలు , అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని టీవీకే (TVK) ఐటీ విభాగం విజ్ఞప్తి చేసింది.

సీఎం విజయ్ బస చేసిన హోటల్ ప్రవేశద్వారాల వద్ద గానీ, ఆయన ప్రయాణించే మార్గాల్లో గానీ అభిమానులు గుమి గూడవద్దని పార్టీ శ్రేణులు కోరాయి. ముఖ్యమంత్రిగా తన తొలి విదేశీ పర్యటనలో ఉన్న విజయ్‌ను ఒక్కసారి చూసేందుకు హోటల్ బయట గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు ఈ నిర్ణయంతో నిరాశకు గురయ్యారు.

#TVK #CMVijayInLondon

Leave A Reply

Your Email Id will not be published!