న్యూఢిల్లీ : మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనా కాలంలో లెక్కకు మించి ప్రధాన పరీక్షలన్నీ లీకులకు కేరాఫ్ గా మారి పోయాయి. తాజాగా ఈ ఏడాది 2026లో నిర్వహించిన నీట్ – యుజి ఎగ్జామ్ తో పాటు సీబీఎస్ఈ -12 పరీక్షలు పూర్తిగా లీకులకు కేరాఫ్ గా మారి పోయాయి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని గుజరాత్ కేంద్రంగా నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు, ఇందులో బీజేపీకి చెందిన ప్రధాన నాయకుడు కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. కేంద్రం వెంటనే సీబీఐని ఏర్పాటు చేసింది విచారణ కోసం. దీంతో గత్యంతరం లేక తిరిగి నీట్ యుజి పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం సమయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). ఈ సందర్భంగా పరీక్షల లీకులకు వ్యతిరేకంగా గళం ఎత్తింది కాంగ్రెస్ పార్టీ.
ఇందు కోసం ఎంపీ రాహుల్ గాంధీ విద్యార్థి సదస్సులను ప్రారంభించారు శనివారం. దీనిని ఓ ఉద్యమంలా చేపట్టారు. ఈ ఉద్యమం రాజకీయ అనుబంధాలకు అతీతంగా విద్యార్థులను ఏకం చేయడానికి, ప్రభావిత యువత తమ అనుభవాలను పంచుకోవడానికి, “పదేపదే పరీక్షలలో వైఫల్యాలు, పేపర్ లీక్ కుంభకోణాల”పై జవాబుదారీతనం కోరడానికి ఒక వేదికను అందించడానికి ప్రయత్నిస్తుందని పార్టీ తెలిపింది. ఆరోపించబడిన పేపర్ లీక్‌లు, పరీక్షా అవకతవకలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారంలో మొదటి దశను కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో భాగంగా జూన్ 17న కోటాలో ప్రారంభమయ్యే వరుస విద్యార్థి సదస్సులలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.
