2027 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ షెడ్యూల్

ప్ర‌క‌టించిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్

దుబాయ్ : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే ఏడాది 2027లో జ‌రిగే ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. ఈ టోర్న‌మెంట్ అక్టోబర్ 4న ప్రారంభమై, నవంబర్ 21న ఫైనల్‌తో ముగియనుంది. దక్షిణాఫ్రికా అత్యధిక మ్యాచ్‌లకు (సుమారు 41), జింబాబ్వే 8–10 మ్యాచ్‌లకు, నమీబియా 3 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నమెంట్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, మరియు నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2003 తర్వాత ఆఫ్రికాలో జరుగుతున్న మొట్టమొదటి వన్డే ప్రపంచ కప్ ఇదే కావ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాదిలో నిర్వ‌హించిన వ‌ర‌ల్డ్ క‌ప్ లో 10 జ‌ట్లు పాల్గొన‌గా ఈసారి కీల‌క మార్పులు చోటు చేసుకుంది.

2027 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ అక్టోబర్ , నవంబర్ 2027లో జరగనుంది. ఈ ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్ల సంఖ్య 14కి పెరగనుంది .. ఇది ఆఫ్రికా వేదికగా జరగబోతోంది. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ అనేది 50 ఓవర్ల మ్యాచ్‌లతో కూడిన వన్ డే ఇంటర్నేషనల్ టోర్నమెంట్. ఈ మెగా టోర్న‌మెంట్ నాలుగు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నుంది. తొలి ద‌శ గ్రూప్ , రెండో ద‌శ సూప‌ర్ సిక్స్ , మూడో ద‌శ సెమీ ఫైన‌ల్స్ , నాలుగో ద‌శ ఫైన‌ల్ . అర్హ‌త పొందాలంటే ఆయా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. 8 జ‌ట్లు నేరుగా అర్హ‌త సాధిస్తాయి. ఇందులో 6 జ‌ట్లు క్వాలిఫైయ‌ర్ల ద్వారా ఎంపిక‌వుతాయి. ఇదిలా ఉండ‌గా దక్షిణాఫ్రికా , జింబాబ్వే గతంలో ప్రపంచ కప్‌లకు ఆతిథ్యం ఇచ్చాయి. కానీ నమీబియా తొలిసారిగా సహ-ఆతిథ్యం ఇవ్వబోతోంది. నమీబియా క్రికెట్‌కు ఇది ఒక ముఖ్యమైన మైలురాయి, అయితే ఆ దేశ జట్టు కూడా సాధారణ ప్రక్రియల ద్వారానే అర్హత సాధించాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్‌లో స్థానం కోసం 8 జట్లు పోటీపడతాయి.
ఉన్నత స్థాయికి (ప్రమోషన్) వెళ్లడానికి దిగువ స్థాయి జట్లు పోటీ పడతాయి.

ఈ టోర్నమెంట్‌లో ఏడు జట్ల చొప్పున రెండు గ్రూపులు ఉంటాయి. ఆ తర్వాత సూపర్ సిక్స్ దశ, సెమీ-ఫైనల్స్ , ఫైనల్ ఉంటాయి. ICC ర్యాంకింగ్స్ ఆధారంగా ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి, అలాగే ఆరు జట్లు ICC క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్ ద్వారా అర్హత సాధిస్తాయి.

Leave A Reply

Your Email Id will not be published!