6న ముంబైలో జెన్ జెడ్ తో ఆర్ఎస్ఎస్ చీఫ్ సంభాష‌ణ‌

ఐఎల్ యుఎన్ వ్య‌వ‌స్థాప‌కుడు కీల‌క ప్ర‌క‌ట‌న

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఆగ‌స్టు 6న ముంబైలో జెన్ జెడ్ తో సంభాషించ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్ వ్య‌వ‌స్థాప‌కుడు రిష‌బ్ షా వెల్ల‌డించారు. నాయకత్వం అంటే తర్వాతి తరానికి మార్గనిర్దేశం చేయడం ,వారి మాటలను వినడం. భారతదేశ ప్రయాణంలో ఈ కీలక దశలో, ఈ సభను ఉద్దేశించి ప్రసంగించేందుకు మా ఆహ్వానాన్ని అంగీకరించినందుకు మోహన్ భగవత్ జీకి నేను కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను అని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో 6న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ‘జెన్ Z’ , ‘జెన్ ఆల్ఫా’ వర్గాలతో సమావేశం కానున్నారు. విడుదలైన సమాచారం ప్రకారం,ఈ కార్యక్రమం ‘ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్’ 15వ వార్షికోత్సవాన్ని , దాని వార్షిక ఛాంపియన్‌షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతోంది.

ఇందులో భారతదేశం అంతటా 100కు పైగా నగరాల నుండి 2,000 మందికి పైగా హైస్కూల్ విద్యార్థులు పాల్గొంటారు. 15 నుండి 19 ఏళ్ల మధ్య వయస్సు గల ఈ పాల్గొనే వారు వివిధ పాఠశాలలు , కళాశాలలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఇది యువత నేతృత్వంలో జరిగే అతిపెద్ద సమావేశాలలో ఒకటి. ఈ సందర్భంగా రిషబ్ షా మాట్లాడుతూ భారతదేశ ప్రయాణంలో ఈ కీలక దశలో, మనకు ఈ సంభాషణ గతంలో ఎన్నడూ లేనంత అవసరం. ఈ కీలక సమయంలో ఈ సభను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఓకే చెప్పార‌న్నారు. త‌న ప్ర‌సంగంతో ప్రధాన వార్షిక ఛాంపియన్‌షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభమవుతుంది; ఇందులో విద్యార్థులు స్థానిక, జాతీయ , అంతర్జాతీయ అంశాలపై చర్చలు, సంప్రదింపులు జరుపుతారు. 108 సమావేశాలను చ‌ వేలాది పౌర సంబంధిత కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం భారతీయ విధానంలో ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్ర అనే ఇతివృత్తం ఆధారంగా సాగుతుంది.

Leave A Reply

Your Email Id will not be published!