శ్రీ సత్యసాయి జిల్లా : విజయవాడ నగరంలో త్వరలో రాష్ట్ర స్థాయి భారీ సూఫీ మహాసభ, బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర సూఫీ మత పెద్దలతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని పవిత్ర హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ దర్గా షరీఫ్‌లో రాష్ట్ర అధ్యక్షుడు సూఫీ తాజ్ బాబా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రముఖ సూఫీ సంప్రదాయం పెద్దలు, సజ్జాదా నషీన్‌లు, మషాయిఖ్‌లు, పీఠాధిపతులు, ముతవల్లీలు, మురీదులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సూఫీ సంప్రదాయం దేవుని ఏకత్వాన్ని నమ్ముతూనే, భగవంతుడిని “ప్రేమ” ద్వారా చేరుకోవచ్చని బోధిస్తుంది. మానవుని ఆత్మ భగవంతుడిలో కలిసి పోవడమే (జీవైక్యం/వహదత్-ఉల్-వుజుద్) వీరి అంతిమ లక్ష్యం. కులం, మతం, వర్గం అనే బేధాలు లేకుండా సమస్త మానవాళిని ప్రేమించడం, శాంతి, సహనం, సత్య మార్గంలో నడవడం సూఫీ ముఖ్య సిద్ధాంతం. విజయవాడ నగరంలో త్వరలో రాష్ట్ర స్థాయి భారీ సూఫీ మహాసభ, బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ సూఫీ సంప్రదాయం పెద్దలు, సజ్జాదా నషీన్‌లు, మషాయిఖ్‌లు, పీఠాధిపతులు, ముతవల్లీలు, మురీదులు ఈ సమావేశానికి హాజరయ్యారు. త్వరలో విజయవాడలో సూఫీ మహాసభ నిర్వహించాలని ప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ మహాసభకు ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి ప్రముఖ సూఫీ మత గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు ప్రత్యేక అతిథులుగా రానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 5 వేల మంది ఫకీర్లు, జలాలీ ఫుఖ్రాలు, రిఫాయీలు, ముర్షిద్లు, బాన్వాలు, ఖలందరీలు తరలి రానున్నారు. సూఫీ సంప్రదాయాల పరిరక్షణ, మానవతా విలువల ప్రచారం, సర్వమత సౌహార్దం, ఆధ్యాత్మిక చైతన్య విస్తరణే ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం. సూఫీ మహాసభ విజయవంతం కోసం త్వరలోనే రాష్ట్ర కార్యవర్గం, ఆ తర్వాత జిల్లా స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని దర్గాల గురువులు, సజ్జాదా నషీన్‌లు, మత పెద్దలతో సంప్రదించి పూర్తి కార్యాచరణ రూపొందిస్తారు. పెనుగొండ దర్గాలో జరిగిన సమావేశానికి హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థాన నిర్వాహకులు అల్తాఫ్ అలీ రజా, జాంపని దర్బార్ అతా ముహమ్మద్ నిజాముద్దీన్ షా తాజ్ ఖాదరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముతవల్లీల సంఘం అధ్యక్షుడు కె.ఎం. షకీల్ షఫీ, ప్రధాన కార్యదర్శి ఉబేదుల్లా సాహెబ్, తెనాలి ప్రాంత సూఫీ పెద్దలు, వివిధ దర్గాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
