చెన్నై : భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, వి ద లీడర్స్ ఉద్యమ అధినేత కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. నీట్ వ్యవహారంపై కేంద్రంపై అన్నామలై విమర్శలు చేయడం కలకలం రేపింది. చర్చల్లో జాప్యంపై వివరణ కోరారు. నిరసన తీవ్రరూపం దాల్చి ఉద్రిక్తత పెరిగే వరకు అర్థవంతమైన చర్చలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకు వేచి చూసిందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్ అయినప్పటికీ ఎటువంటి జవాబుదారీతనం లేదని ఆరోపిస్తూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మాజీ బీజేపీ నేత కె. అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులతో చర్చలు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత సమయం తీసుకుందని ఆయన నిలదీశారు.
వి ది లీడర్స్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అన్నామలై, నిరసన తీవ్రస్థాయికి చేరే వరకు అర్థవంతమైన చర్చలు ఎందుకు జరపలేదని మండిపడ్డార. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అర్థవంతమైన చర్చలు జరపాలని, పారదర్శకతను పాటించాలని, ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కె. అన్నామలై డిమాండ్ చేశారు. ఏ దేశ బలానికైనా ఆ దేశ యువతకు తమ వ్యవస్థలపై ఉండే నమ్మకమే మూలాధారం అన్నారు. ఒకవేళ మన విద్యార్థులు మన విద్యా వ్యవస్థ యొక్క నిష్పాక్షికత , విశ్వసనీయతపై నమ్మకం కోల్పోతే, మనం మన దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేసినట్లవుతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
