బీజేపీ మూకల దాడి పిరికిపంద చర్య : షర్మిలా రెడ్డి

కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేయ‌డం దారుణం

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఇవాళ ఆమె విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ మూకల దాడి పిరికిపంద చర్య అని మండిప‌డ్డారు. యువత భవిత కోసం కాంగ్రెస్ చేస్తున్న శాంతియుత ఆందోళలకు సమాధానం చెప్పే దమ్ములేక ఇలా దాడుల‌కు దిగ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. సహనం కోల్పోయి ఇలాంటి భౌతిక దాడులా ? సిగ్గు సిగ్గు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ష‌ర్మిలా రెడ్డి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి నీతి మాలిన చర్యలు అత్యంత హేయమైనవి అని అన్నారు. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గరుండి గూండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ శ్రేణులపై దాడులకు ఉసిగొల్పడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఆంధ్రరత్న భవన్ వద్ద బీజేపీ పాల్పడిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు ష‌ర్మిలా రెడ్డి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. అధికారాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని, ఏదిచేసినా చెల్లుతుందని అనుకుంటే పొర‌పాటే అవుతుంద‌న్నారు. అధికారం ఏ ఒక్క‌రి సొత్తు కాద‌ని గుర్తు పెట్టుకోవాల‌ని వార్నింగ్ ఇచ్చారు. తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం అన్నారు.రోమ్ తగల బడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుంది పేపర్ లీకులపై మోదీజీ కామెంట్లు అంటూ ఎద్దేవా చేశారు. రాజీనామాకు డిమాండ్ చేస్తూ దేశమంతా ఏకతాటిపై ఉద్యమం చేస్తుంటే, మోడీజి నీతి సూత్రాలు చెప్పడం అత్యంత హాస్యాస్పదం అన్నారు. అసలు లీకుల సూత్రధారి ప్రధాని అయితే, పాత్రధారి విద్యాశాఖ మంత్రి అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!