ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓట‌మి

1-2 తేడాతో వ‌న్డే సీరీస్ కోల్పోయింది

ఇంగ్లండ్ : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన లార్డ్స్ మైదానం వేదిక‌గా జ‌రిగిన మూడో కీల‌క వ‌న్డేలో ప‌రుగుల వ‌ర‌ద పారింది. అయినా భార‌త జ‌ట్టు ఓట‌మి నుంచి గ‌ట్టెక్క‌లేక పోయింది. ఆతిథ్య ఇంగ్లండ్ చేతిలో 27 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. రోహిత్ శ‌ర్మ సెంచ‌రి చేసినా, కోహ్లీ, గిల్ లు అద్భుతంగా ఆడినా ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. దీంతో గంభీర్ పై భ‌గ్గుమంటున్నారు ఫ్యాన్స్. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే రోహిత్ శ‌ర్మ అద్భుతంగా ఆడాడు. త‌ను 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేయగా, కోహ్లీ 60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. గిల్ 84 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

మూడవ వన్డేలో ఇంగ్లాండ్ భారత్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారీ లక్ష్యం 3 వికెట్లకు 387 పరుగులు ముందుండగా, భారత్ 7 వికెట్లకు 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. బౌలర్లలో ఇంగ్లాండ్ తరపున సామ్ కర్రన్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 75 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు, సిరీస్ విజేతను నిర్ణయించే మూడవ, చివరి వన్డేలో బెన్ డకెట్ 141 పరుగులతో దుమ్ము రేపాడు. భార‌త బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. త‌న‌తో పాటు జాకబ్ బెథెల్ 91 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరును నమోదు చేసింది. స్వ‌దేశంలో భార‌త్ టెస్టు సీరీస్ ను కోల్పోయింది. జింబాబ్వే, ఐర్లాండ్ తో పాటు ప్ర‌స్తుతం ఇంగ్లండ్ తో కూడా సీరీస్ ల‌ను కోల్పోవ‌డం విస్తు పోయేలా చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!