చెన్నై : తమిళనాడు ప్రభుత్వం పెట్టుబడిదారులకు సంపూర్ణ సహాయ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు మంత్రి కీర్తన. శాసన సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. రాణిపేటలోని జేకే టైర్ యూనిట్ గురించి ప్రస్తావించారు. పరిశీలనలో తేలిందేమిటంటే రాణిపేటలో జేకే టైర్‌కు ఎలాంటి తయారీ కేంద్రం లేదని, అయినప్పటికీ సభ్యులు లేవనెత్తిన పర్యావరణ సమస్యను పరిశీలిస్తామన్నారు కీర్తన. సంబంధిత జేకే టైర్-యేతర యూనిట్‌ను గుర్తించడం జరుగుతుందన్నారు. అవసరమైన చోట తగిన చర్యలు తీసుకోబతాయని ప్రకటించారు. సభలో నా స్పందన ఒక విస్తృతమైన , ముఖ్యమైన సూత్రంపై ఆధారపడి ఉందన్నారు. తమిళనాడుకు పరిశ్రమలు, ఉద్యోగాలు అవసరం, కానీ పర్యావరణ నిబంధనల పాటింపుతో అభివృద్ధి సాధ్యపడదని అన్నారు కీర్తన. రెండూ కలిసే జరగాలన్నారు. తమ కార్యకలాపాలు వర్తించే అన్ని చట్టబద్ధమైన పర్యావరణ అనుమతులు, నియంత్రణ అవసరాలకు అనుగుణంగానే ఉన్నాయని జేకే టైర్ కూడా స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
ఇంకా చెప్పాలంటే ఇటీవల వెట్రీ తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ కాన్క్లేవ్లో గైడెన్స్ తమిళనాడుతో ₹5,143 కోట్ల పెట్టుబడి కోసం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చు కోవడం ద్వారా జేకే టైర్ తమిళనాడుపై తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించిందని చెప్పారు కీర్తన. ఈ పెట్టుబడి ద్వారా 3,510 ఉద్యోగ అవకాశాలు సృష్టించబడే అవకాశం ఉందన్నారు. జేకే టైర్, ఇతర ప్రముఖ కంపెనీలు తమిళనాడుపై ఉంచుతున్న విశ్వాసాన్ని తాము గౌరవం ఇస్తామన్నారు. తమ ప్రభుత్వం పెట్టుబడులకు మద్దతు ఇవ్వడం, నాణ్యమైన ఉపాధిని కల్పించడం, పరిశ్రమలు వర్తించే అన్ని పర్యావరణ, నియంత్రణ నిబంధనలను పాటించేలా చూడటం కొనసాగిస్తుందని ప్రకటించారు. ఈ సందర్బంగా సుస్థిరమైన పారిశ్రామిక వృద్ధికి తమిళనాడు దృఢంగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి కీర్తన.
