న‌కిలీ ఏఐ నీట్ ఓఎంఆర్ షీట్స్ పై వార్నింగ్

కీల‌క ఆదేశాలు జారీ చేసిన నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ

న్యూఢిల్లీ : నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఫేక్ ఏఐ తో నీట్ ఓఎంఆర్ షీట్స్ ను త‌యారు చేసినా లేదా షేర్ చేసినా , స‌ర్క్యులేట్ చేసినా తీవ్ర చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు విద్యార్థుల‌ను అలర్ట్ చేసింది. ఈ ఫేక్ ఓఎంఆర్ షీట్స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. స్కోరు వ్యత్యాసాలపై ఫిర్యాదు చేసేటప్పుడు తప్పుడు ఓఎంఆర్ షీట్లను సమర్పించే అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ పేర్కొంది. స్కోరు ధృవీకరణ కోసం అసలైన ఓఎంఆర్ షీట్లను మాత్రమే సమర్పించాలని స్ప‌ష్టం చేసింది ఎన్టీఏ.

నకిలీ లేదా ఏఐతో త‌యారు చేసిన‌ పత్రాల విషయంలో చట్ట పరమైన చర్యలు ఉంటాయని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు, తల్లిదండ్రులకు సూచించింది. స్కోరు వ్యత్యాసాలపై ఫిర్యాదు చేసేటప్పుడు నకిలీ లేదా AI-సృష్టిత ఓఎంఆర్ షీట్లను సమర్పించ వద్దని హెచ్చరిక జారీ చేసింది. అభ్యర్థులు ఆశించిన స్కోరుకు , ప్రకటించిన నీట్ 2026 స్కోరుకు మధ్య ఉన్న తేడాలపై వచ్చిన అనేక ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఈ హెచ్చరిక వెలువడింది. పరిశీలన ప్రక్రియలో, ఫిర్యాదులతో సమర్పించిన అనేక ఓఎంఆర్ షీట్లు నకిలీవిగా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సృష్టించినట్లుగా ఉన్నాయని ఏజెన్సీ గుర్తించింది.

అన్ని ఫిర్యాదులను నిశితంగా పర్యవేక్షిస్తోంది, పరిశీలిస్తోంది. పరిశీలన కోసం సమర్పించిన అనేక ఓఎంఆర్ షీట్లు నకిలీవిగా లేదా AI-సృష్టితమైనవిగా తేలడంతో అసలైన ఓఎంఆర్ ల‌ను మాత్రమే సమర్పించాలని పేర్కొంది. వైద్య ప్రవేశ పరీక్ష ఫలితాలు జూలై 16న ప్రకటించింది. ఇందులో 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

Leave A Reply

Your Email Id will not be published!