అమరావతి : ప్రజా స్వామ్యంలో ప్రజలే ముఖ్యం, అత్యంత కీలకం అని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కేవలం ఒక గెలుపు కాదు ..అహంకారంపై సామాన్యుడు సంధించిన ఒక బలమైన సందేశం. ఒక తిరుగులేని హెచ్చరిక. భయాన్ని, అహంకారాన్ని, అధికారమే అంతా అనే అనాగరిక రాజకీయ సంస్కృతిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరూ ఎక్కువ కాదని నిరూపించారు. ఆ నాడు ఓటర్లు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ సమాజానికి కొండంత ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా, రాబోయే తరాల భవిష్యత్తుకు గట్టి నమ్మకాన్ని కల్పించిందని అన్నారు సీఎం. ప్రజలు మనకిచ్చింది కేవలం అధికారం కాదు, రాష్ట్రాన్ని కాపాడి ప్రగతిపథంలో నడిపించే ఒక గొప్ప బాధ్యత అన్నారు. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఓటరుకీ, రైతుకు, నాయకుడికి, కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కూటమిలోని ఏ ఒక్క పార్టీదో కాదు, ఇది ప్రజా విజయమని అన్నారు.
.
అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదు. అధికారాన్ని ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లడమే నిజమైన ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు సీఎం. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో 600 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉంటారు. ప్రజాస్వామ్యానికి వారే వేళ్లు. ఆ రూట్స్ ని బలహీనపరిస్తే చెట్టుని బలపర్చలేం. స్థానిక సంస్థల్ని బలహీనపర్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేం. ఇది ప్రజాస్వామ్య సూత్రం. నాయకత్వం గ్రామ స్థాయి నుంచి రావాలి. రెండేళ్లలో మేము గ్రామాల్లో నిర్మించడానికి ప్రయత్నించింది కేవలం కేవలం రోడ్లు, కాలువలు, భవనాలు కాదు. వ్యవస్థల మీద నమ్మకం. ఒక వ్యవస్థ బలహీన పడినప్పుడు మొదట కోల్పోయేది డబ్బు కాదు. నమ్మకం. వ్యవస్థ న్యాయం చేయకపోతే కులం ముందుకు వస్తుంది. వ్యవస్థ బలహీన పడితే ప్రాంతీయత ముందుకు వస్తుంది. వ్యవస్థపై విశ్వాసం తగ్గితే సమాజం చిన్న చిన్న గుంపులుగా విడిపోతుందని అన్నారు.
Breaking
- విండీస్ తో వన్డే సీరీస్ కు రోహిత్, కోహ్లీ ఎంపిక
- ‘సెమికాన్ 2.0’ కింద 200 చిప్ డిజైన్ స్టార్టప్‌లు
- రాష్ట్ర పండుగగా విశ్వకర్మ భగవానుడి జయంతి
- సరస్వతి అమ్మవారి అలంకారంలో శ్రీ వేంకటేశ్వర స్వామి
- జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం
- ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది : జగన్
- గొడ్డలి పార్టీ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలి
- ’22ఎ’లో 12 రకాల సమస్యలు గుర్తించాం : సీఎం
- వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
- అంగరంగ వైభోగం కళాకారుల నృత్య నీరాజనం