చెన్నై : తమిళనాడు సినీ రంగంలో అత్యంత జనాదరణ పొందిన అగ్ర నటుడు తలైవా రజనీకాంత్. తను గతంలో నటించిన చిత్రం జైలర్ సూపర్ హిట్ గా నిలిచింది. భారీ వసూళ్లను రాబట్టింది. వసూళ్ల పరంగా రికార్డ్ సృష్టించింది. తన డిఫరెంట్ మేనజరింతో రజనీకాంత్ అన్నీ తానై వ్యవహరించాడు. జైలర్ కు బిగ్ అసెట్ గా మారాడు. ఆశించిన దానికంటే బిగ్ సక్సెస్ కావడం, కలెక్షన్ల పంట పండించడంతో దర్శక, నిర్మాతలు జైలర్ -2కు శ్రీకారం చుట్టారు. షూటింగ్ కంటిన్యూగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. బాలీవుడ్ కు చెందిన టాప్ హీరో హృతిక్ రోషన్ జైలర్ -2లో నటిస్తున్నట్లు సమాచారం.
విచిత్రం ఏమిటంటే 40 ఏళ్ల తర్వాత తెరపై కలవనున్నారు హృతిక్ రోషన్, రజనీకాంత్ . ఇదిలా ఉండగా బాల నటుడిగా ‘భగవాన్ దాదా’ చిత్రంలో రజనీకాంత్‌కు గట్టి పోటీనిచ్చాడు హృతిక్ రోషన్, ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయనతో కలిసి తెరను పంచుకోబోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తన స్టార్‌డమ్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, చివరి నిమిషంలోనైనా ‘జైలర్ 2’లో రజనీకాంత్‌తో కలిసి ఒక అతిథి పాత్ర చేయడానికి హృతిక్ అంగీకరించారు. రజనీకాంత్‌తో కలిసి కెమెరా ముందుకు రావడం అనే ఆలోచనే ఆయన ‘అవును’ అని చెప్పడానికి సరి పోయింది. షూటింగ్ ఎప్పుడు చేయాలో చెబితే చాలని ఆయన ‘జైలర్ 2’ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో చెప్పినట్లు సమాచారం. హృతిక్ కేవలం నాలుగు లేదా ఐదు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆయన పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు కానీ, రజనీకాంత్‌తో కలిసి ఒక అద్భుతమైన యాక్షన్ సన్నివేశంలో రోషన్ కనిపించనున్నట్లు టాక్.
